గ్లోబల్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర.. ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.. త్రిపుల్ ఆర్ సినిమా తర్వాత వస్తున్నా సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమా పై రెట్టింపు అంచనాలను పెంచేస్తున్నాయి.. గతంలో ఎక్కడ కనిపించని లుక్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపిస్తున్నారు.. ఇక దేవర మూవీకి ఉన్న హైప్ ఎలాంటిదో మనకు తెలుసు..
ఈ సినిమాను రెండు పార్ట్ లు తెరకేక్కిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమా నుంచి బయటకు వచ్చిన గ్లింప్స్ తో ఈ రేంజ్ లో మాస్ గా ఉండబోతుందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. దేవర పార్ట్ 1 సినిమాని మొదట ఏప్రిల్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించినా ఇంకా షూట్ అవ్వకపోవడంతో ఈ సినిమాని 10 అక్టోబర్ 2024లో రిలీజ్ చేయబోతున్నట్లు అధికారక ప్రకటన ఇచ్చారు మేకర్స్..
ఇదిలా ఉండగా.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో జరుగుతుంది.. శృతి మరాఠే దేవర సెట్స్ లో తన కారవాన్ లో సెల్ఫీ తీసుకొని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి దేవర షూట్ అని తెలిపింది. దీంతో శృతి మరాఠే ప్రస్తుతం టాలీవుడ్ లో వైరల్ గా మారింది. శృతి మరాఠే మరాఠీ, తమిళ్ లో పలు సినిమాలు చేయగా ఇప్పుడు దేవర సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా కనపడబోతున్నారు. శ్రీకాంత్, షైన్ టామ్ చాకో.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు..