హైకోర్టులో స్టీలు ప్లాంటు అమ్మకుండా ఉండటానికి ఆర్డర్ తెచ్చానంటూ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. జస్టిస్ నరేంద్ర, జస్టిస్ న్యాపతిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత మూడేళ్ళుగా స్టీల్ ప్లాంటు అమ్మకం జరగకూడదని పోరాడుతున్నానని కేఏ పాల్ అన్నారు.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం జగన్‌ను కలిసి ఏమైనా కావాలి అని అడిగితే బాలినేని అలిగాడు అంటారని.. ఎందుకు అలుగుతాను ప్రజల సమస్యలు పరిష్కరించుకోవటానికే కదా అంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
ప్రతి నెల ఆర్థిక విషయాల్లో అనేక మార్పులు రావడం మనం చూస్తూనే ఉన్నాం.. రేపటితో ఫిబ్రవరి నెల ముగియనుంది.. మార్చి నెలలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.. కొత్త నెల ప్రారంభంలో నిబంధనల్లో కొన్ని మార్పులు సహజం.. మార్చి 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. మార్చితో ఆర్థిక ఏడాది ముగుస్తోన్న నేపథ్యంలో కొత్త నిబంధనలపై సామాన్యులు అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు.. వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఏంటో ఒకసారి…
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. కొన్ని వీడియోలను చూసి జనం తెగ నవ్వుకుంటే.. మరి కొన్ని వీడియోలు జనాలకు కోపాన్ని తెప్పిస్తుంటాయి.. నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి… తాజాగా మరో వీడియో వైరల్ అవుతుంది.. ఓ వ్యక్తి తన సోషల్ మీడియాకు సంబందించిన క్యూఆర్ కోడ్ ను టాటుగా వేయించుకున్నాడు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి నుదిటిపై క్యూఆర్…
ప్రముఖ అమెరికన్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ ‘డిస్నీ ఇండియా అధినేత వాల్ట్ డిస్నీ మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డిస్నీ తన వ్యాపారాన్ని భారతదేశంలో కూడా విస్తరించాలని చూస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. టెలివిజన్‌తో సహా మొత్తం డిజిటల్ స్ట్రీమింగ్ వ్యాపారాన్ని విక్రయించడానికి పలువురు వ్యాపారులతో చర్చలు జరుపుతున్నారని బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదించింది. ఇప్పటికే భారతదేశంలో డిజిటల్ స్ట్రీమింగ్ రంగంలోకి ప్రవేశించిన ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కూడా డిస్నీ ఇండియాను కొనుగోలు చేసే రేసులో ఉన్నట్లు గతంలో…
ప్రముఖ నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అందులో బెంగుళూరు ట్రాఫిక్ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే.. ఈ మధ్య బెంగుళూరు ట్రాఫిక్ గురించి నిత్యం సోషల్ మీడియాలో ఏదోక వార్త వైరల్ అవుతూ వస్తుంది.. ఇప్పుడు మరో వార్త నెట్టింట వైరల్ గా మారింది.. అసలు విషయానికొస్తే .. బెంగళూరులోని కబ్బన్ పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన ఓ ట్రాఫిక్ సైన్ బోర్డు రోడ్డు వద్ద ట్రాఫిక్ రూల్స్ కోసం ఇచ్చిన ఒక…
గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. వివేకానందకు సయ్యద్ అబ్బాస్ అలీ 10 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్టు పోలీసులు గుర్తించారు. నిన్న ( మంగళవారం ) సయ్యద్ అబ్బాస్ ఆలీని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
నాన్ వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. చికెన్ ధరలు భారీగా పెరిగాయి.. ఈ వార్త విన్న చికెన్ ప్రియులు చికెన్ కొనడానికి వెనకడుగు వేస్తున్నారు.. ఏపీలో ఒక్కసారిగా ధరలు పెరిగాయి.. కిలో చికెన్ ధర రూ. 300 పలుకుతుంది.. పెరిగిన ఎండలతోపాటు కోళ్ల ఉత్పత్తి తగ్గడమే దీనికి ప్రధాన కారణమని వ్యాపారులు అంటున్నారు. మరో పక్క బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోతున్నాయి. మార్చి వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. సామాన్యులకు పెరిగిన…
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు సినిమాలతో పాటుగా కమర్శియల్ యాడ్ లను కూడా చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు.. ఆయన ఖాతాలో ఎన్నో బ్రాండ్ లు ఉన్నాయి.. ఇటీవల ఫోన్ పే స్పీకర్లకు తన వాయిస్ ను అందించారు.. ఫోన్‌పే స్మార్ట్ స్పీకర్లకు చేసిన డిజిటల్ చెల్లింపుల కోసం వాయిస్‌ని అందించిన మొదటి సౌత్ ఇండియన్ సెలబ్రిటీగా మహేష్ బాబు నిలిచారు. ఇప్పుడు అదే బాటలో మరో ఇద్దరు సూపర్ స్టార్లు నడుస్తున్నారు. మలయాళ మెగాస్టార్…
హైదరాబాద్ నగరంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం నాడు అర్థరాత్రి సమయంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్ఏఎల్ రాఘవేంద్ర కాలనీకి దగ్గరలో ఉన్న ఫ్రూట్స్ స్టాల్, మటన్ దుకాణం, స్క్రాప్ దుకాణాల్లో ఒక్కసారిగా ప్రమాదం సంభవించింది.