సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. కొన్ని వీడియోలను చూసి జనం తెగ నవ్వుకుంటే.. మరి కొన్ని వీడియోలు జనాలకు కోపాన్ని తెప్పిస్తుంటాయి.. నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి… తాజాగా మరో వీడియో వైరల్ అవుతుంది.. ఓ వ్యక్తి తన సోషల్ మీడియాకు సంబందించిన క్యూఆర్ కోడ్ ను టాటుగా వేయించుకున్నాడు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..
ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి నుదిటిపై క్యూఆర్ కోడ్ టాటూ వేయించుకున్నాడు. వినడానికి విడ్డూరంగా అనిపించినా ఇది అక్షరాలా నిజం. ముఖంపై క్యూఆర్ కోడ్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది అక్షరాల నిజం.. నిజానికి క్యూఆర్ కోడ్ అనేది స్మార్ట్‌ఫోన్ లేదా కెమెరా ద్వారా స్కాన్ చేయగల బార్‌కోడ్ అనే సంగతి మనందరికీ తెలిసిందే.. అలాంటి కోడ్ ను నుదుటి పై టాటుగా వేయించుకొని అందరికీ షాక్ ఇచ్చాడు..
ఆ వ్యక్తి సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించాలని వైరల్ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి భావించాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ వ్యక్తి క్యూట్ కోడ్ టాటూ అతని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు లింక్ చేశాడు.. ఆ వీడియోలో వ్యక్తి టాటును ఎలా వేయించుకున్నాడు.. అనేది కనిపిస్తుంది.. టాటు వేస్తున్నపుడు మనిషి నొప్పితో ఉన్నట్లు కనిపిస్తున్నాడు, కానీ కదలడు లేదా ఫిర్యాదు చేయడు. టాటూ ఆర్టిస్ట్ క్యూఆర్ కోడ్‌ని పూర్తి చేసి, ఆపై దానిని పరీక్షిస్తాడు. అతను తన ఫోన్‌తో మనిషి నుదిటిని స్కాన్ చేస్తాడు..అంతే అతని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ అవుతుంది.. ఆ వీడియోను మీరు ఒకసారి చూడండి..