కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కుల గణన చేయడానికి వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. కుల గణన పై షెడ్యూల్ ఖరారు చేయడానికి రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో సెక్రటేరియట్ లోని వారి ఛాంబర్ లో కీలక సమావేశం జరిగింది. సమావేశంలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తో పాటు ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి,బీసీ కమిషన్ సభ్యులు , సభ్యులు వివిధ శాఖల…
గుంటూరు కలెక్టరేట్‌లో కౌలు రైతుల చట్టంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. కౌలు రైతుల చట్టంపై ఐదు జిల్లాల వ్యవసాయ అధికారులతో సమీక్షించారు.
తెలంగాణలో భారీ వర్షాలతో దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణ, మరమ్మతు పనులకు రూ.11,713.49 కోట్లు సత్వరమే విడుదల చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం భేటీ అయ్యారు. తెలంగాణలో ఆగస్టు 31 నుంచి నుంచి సెప్టెంబరు 8వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాలు రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపాయని సీఎం తెలిపారు.
గల్ఫ్ కార్మికుల సంక్షేమ కోసం ప్రభుత్వం చర్యలను చేపడుతోంది. గల్ఫ్ వర్కర్స్‌కు ఐదులక్షల పరిహారం ప్రకటిస్తూ ప్రభుత్వం గైడ్‌లైన్స్ విడుదల చేసింది. గల్ఫ్‌కి వెళ్లి చనిపోయిన కార్మికుడికి ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
హైదరాబాద్ సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్ ను(సీఎస్ఎంపీ) అమృత్ 2.0లో చేర్చాలని లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టాలని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖట్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కలిశారు. చారిత్రక హైదరాబాద్ నగరంలో పురాతన మురుగుశుద్ధి వ్యవస్థనే ఉందని, అది ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా లేదని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. హైదరాబాద్ సమీప పురపాలక సంఘాల్లోనూ…
చెరువులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే నగరంలో చెరువుల పరిరక్షణపై లేక్ ప్రొటక్షన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల గుర్తించేందుకు ఇరిగేషన్, రెవెన్యూ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్, సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో సోమవారం హైడ్రా కమిషనర్ ,లేక్ ప్రొటక్షన్ కమిటీ ఛైర్మెన్ ఏవీ రంగనాథ్ సమీక్ష నిర్వహించారు. నగరంలో చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు,…
హైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్, ఎంఐఎం నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్, కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ అనుచరుల మధ్య గొడవ జరిగింది. బ్యాంకు కాలనీలో రహదారి పనుల పరిశీలనకు కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్‌పై వచ్చారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ చోటు చేసుకుంది. అయితే.. వివరాల్లోకి వెళితే.. కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్, నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ వారి మద్దతుదారుల మధ్య సోమవారం మధ్యాహ్నం నాంపల్లి…
రాష్ట్రంలో మెరుగైన రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధ్వంసమైన 7071 కి.మీ రహదారులకు సంబంధించిన 1393 రోడ్లను గుంతల రహిత రహదారులుగా మార్చేందుకు రూ.290 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని మంత్రి వివరించారు
దసరా ఆపరేషన్స్‌పై పోలీస్, రవాణా శాఖల అధికారులతో ఆర్టీసీ సమన్వయ సమావేశం నిర్వహించారు. సద్దుల బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికులను క్షేమంగా సొంతూళ్లకు చేర్చేందుకు టీజీఎస్ఆర్టీసీకి సహకరించాలని పోలీస్, రవాణా శాఖల అధికారులను సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు. గత దసరాతో పోల్చితే ఈ సారి మహాలక్ష్మి పథకం అమలు వల్ల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముందని, గతంలో మాదిరిగానే సహాయసహకారాలు అందించాలని ఆయన కోరారు. దసరా ఆపరేషన్స్‌పై హైదరాబాద్ లోని బస్ భవన్ లో…