దుబాయ్‌లో పాఠశాల విద్య, హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసిన విద్యార్థిని ఎంబీబీఎస్ అడ్మిషన్లకు స్థానిక అభ్యర్థిగా గుర్తించాలని తెలంగాణ హైకోర్టు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌ను ఆదేశించింది. కొండాపూర్‌కు చెందిన అనుమత ఫరూక్ పిటిషన్‌ను విచారించిన అనంతరం చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ శ్రీనివాస్‌రావుతో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లలో స్థానిక అభ్యర్థిగా పరిగణించకుండా తప్పించడాన్ని ఫరూక్ సవాలు చేశారు. ఫరూక్ 1998 నుంచి…
ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. మూడురోజుల క్రితం వెలుగుచూసిన ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. ఎన్టీవీలో ప్రసారం అయిన కథనాలకు అధికారులు స్పందించి ర్యాగింగ్ చేసిన సీనియర్ విద్యార్ధినులు పది మందిపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా 15 రోజుల పాటు సస్పెండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం 11,063 ఉపాధ్యాయ పోస్టుల జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) రిక్రూట్‌మెంట్ తుది జాబితాను నేటి (అక్టోబర్ 7, సోమవారం) సాయంత్రంలోపు విడుదల చేయనుంది. ఎంపికైన ఉద్యోగ అభ్యర్థులకు ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తమ జాయినింగ్ ఆర్డర్‌లను స్వీకరించేందుకు అక్టోబర్ 9వ తేదీ బుధవారం మధ్యాహ్నం 2 గంటలలోపు ఎల్‌బి స్టేడియానికి చేరుకోవాలని అభ్యర్థించడం జరిగింది. ఆదివారం సాయంత్రం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ..…
కర్నూలు జిల్లాలో ఓ వింత పందెం వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకునేలా చేసింది. బతికి ఉన్న చేపను మింగాలని సరదాగా స్నేహితులు వేసుకున్న పందెంతో ఓ వ్యక్తి ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. బతికున్న చేపను మింగి వెంకటస్వామి అనే వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.
చదివింది తొమ్మిదో తరగతి.. కానీ మోసాలు చేయడంలో మాత్రం ఇస్రో శాస్త్రవేత్తల కంటే ఎక్కువ తెలివితేటలు చూపించి నాలుగు పెళ్లిళ్లు చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడొక నిత్య పెళ్ళికొడుకు. ఇస్రోలో హెచ్‌ఆర్ ఉద్యోగం అని చెబుతూ.. వందల ఎకరాల పొలాలు, విల్లాలు ఉన్నాయని ... పెళ్లికూతుళ్ల కుటుంబ సభ్యులకు ఇస్రోలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బంపర్ ఆఫర్లు ఇచ్చి లక్షలకు లక్షలు దోచేస్తున్న ఆ ప్రబుద్ధుడి ఆట కట్టించారు ఏలూరు జిల్లా భీమడోలు పోలీసులు
ప్రజల సంక్షేమం, అభివృద్ధి కంటే మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రూ.1.5 లక్షల కోట్లతో మూసీ రివర్‌ఫ్రంట్ వంటి గొప్ప కార్యక్రమాలను ఏకకాలంలో నిర్వహిస్తూనే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ముఖ్యమంత్రి అనడంపై ఆయన మండిపడ్డారు. “ప్రతిరోజూ రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెరుగుతున్న అప్పుల గురించి ఏడుస్తూనే ఉంటాడు, కానీ చాలా మందికి అనవసరమైన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్…
హైడ్రాపేరుతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కొన్ని వాస్తవ విషయాలు తెలియాలని ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైడ్రా పేరు మీద ప్రతిపక్షాలు కొన్ని వ్యవస్థలు ప్రభుత్వం పై చేస్తున్న నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని, మూసీ రిజర్వేషన్ పై సీఎం, ప్రభుత్వం కార్యక్రమంపై అపోహలు సృష్టించి… పాలనపై తప్పుడు ఆరోపణలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.…
కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని సహా కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. సాయంత్రం 4.45గంటలకు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. సాయంత్రం 6:15కి రైల్వే, సమాచార ప్రసారాల శాఖల మంత్రి అశ్వని వైష్ణవ్‌తో భేటీ కానున్నారు.
రోజు రోజుకు కూరగాయాల ధరలు మండిపోతున్నాయి. మటన్, చికెన్ ధరలకు పోటీగా కూరగాయాల ధరలు పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు జేబులకు చిల్లుపడుతోంది. దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో కూరగాయాల ధరలు ఆకాశానంటుతున్నాయి. పండుగ వేళ కావడంతో మార్కెట్లలో పూల ధరలు సైతం పెరిగిపోయాయి. అయితే.. దేవి నవరాత్రోత్సవాల ఉండటంతో శాఖాహార ప్రియులు కూరగాయలు కొనడం తప్పదనే చెప్పాలి. అయితే.. ముఖ్యంగా కూరగాయాల్లో టమాటో ధరలు కన్నీరు పెట్టిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని మైదరాబాద్ మార్కెట్లలో కిలో టమాటో ధర…