కేంద్ర మంత్రి బండి సంజయ్, తాను వేర్వేరు పార్టీలో ఉన్నప్పటికీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి విషయంలో మాత్రం రాజీలేకుండా పనిచేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లోని మహాశక్తి ఆలయానికి విచ్చేశారు. ఆలయ నిర్వాహకులు పొన్నంకు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తో కలిసి మహాశక్తి అమ్మవార్లను దర్శించుకుని…
తెలంగాణలో సమగ్ర కులగణనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఇప్పటికే ఈ కులగణనకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, శుక్రవారం సమగ్ర కులగణనకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సర్వేను ఇంటింటి కుటుంబాల రిజిస్ట్రేషన్ ద్వారా నిర్వహించనున్నట్లు జీవో విడుదల చేసింది. ఈ సర్వేను ప్రణాళికశాఖకు అప్పగిస్తూ, ముఖ్య కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సర్వేను 60 రోజుల్లో పూర్తి చేయాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. Sayaji…
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని చెడు మీద నిత్యపోరాటం చేస్తూ మంచి దిశగా విజయం సాధించాలనే జీవన తాత్వికతను విజయ దశమి మనకు తెలియజేస్తుందని కేసీఆర్ తెలిపారు. దసరా నాడు శుభసూచకంగా పాలపిట్టను దర్శించి, షమీ వృక్షానికి పూజ చేసి, జమ్మి ఆకును బంగారంలా భావించి పెద్దలకు సమర్పించుకుని వారి ఆశీర్వాదం తీసుకోవడం, గొప్ప భారతీయ సాంస్కృతిక ఆచారమని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ…
రాష్ట్ర ప్రభుత్వం, కోటీశ్వరుల పిల్లలకు అందించిన నాణ్యమైన విద్యను పేద పిల్లలకు అందించాలనే లక్ష్యంతో యువ భారత ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా గంధంవారి గూడెంలో రూ.300 కోట్లతో నిర్మించబోతున్న ఈ పాఠశాల ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైలాన్ ఆవిష్కరించి, భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఇంగ్లీష్, తెలుగు…
కాశ్మీర్ లో వంద శాతం టార్గెట్ రిచ్ అయ్యామని, హర్యానాలో EVM టాంపరింగ్ జరిగితే జమ్మూలో ఎందుకు జరగలేదు? కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లో EVM టాంపరింగ్ ఎందుకు జరగలేదన్నారు కేంద్ర మంత్రి, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇంచార్జ్ కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూలో ఒక రకంగా ఓటర్ల పోలరైజ్.. కాశ్మీర్ లో మరోరకంగా పోలారైజ్ జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ప్రశాంతంగా అత్యధిక పోలింగ్ జరిగిన ఎన్నికల ఇవి అని, హర్యానా ఎగ్జిట్…
రంగారెడ్ది జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన చేసి.. శిలా ఫలకం ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ దసరా నాలుగు కోట్ల తెలంగాణా ప్రజలకు సుఖ శాంతులు ఇవ్వాలని.. మంచి పంటలు ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రోజునే మేము వాగ్దానం చేసినం..…
మజ్లిస్తో సంబంధం వేరు.. లా అండ్ ఆర్డర్ వేరు అని, తప్పు చేస్తే ఎవరికైనా ఒకటే రూల్ అని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హెల్త్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ ప్రభుత్వానికి చాలా ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త, పాత అంత కలుపుకుని పోతున్నామని ఆయన తెలిపారు. ఏ అంశంలో అయిన ముందు నుండి ఉన్న కాంగ్రెస్ నాయకులకీ ముందు ప్రియారిటీ ఉంటదన్నారు. కేంద్రమంత్రి హోదాలో ఉండి కిషన్ రెడ్డి…
IAS Officers: ఏపీ, తెలంగాణ కేడర్ విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమను ఏపీలోనే కొనసాగించాలన్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ల అభ్యంతరాలను మోడీ సర్కార్ తోసిపుచ్చింది.