కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనాతిలో లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. రథోత్సవం జరుగుతుండగా పక్కకు ఒరిగి చుట్టూ వున్న జనంపై రథం పడిపోయింది.
ఏపీ రాష్ట్రంలో సోమవారం నుంచి పల్లె పండుగ వారోత్సవాలను జరపాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈ కార్యక్రమం రాష్ట్రంలోని 13,324 గ్రామాల్లో ఒకేసారి నిర్వహించనున్నారు, ఇది గ్రామీణ అభివృద్ధికి పెద్ద దోహదం చేసే అవకాశం ఉంది. కృష్ణా జిల్లా కంకిపాడులో జరిగే వారోత్సవాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. ఈ పండుగలో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 4,500 కోట్లతో 30,000 పనులను చేపట్టనుంది. ఇందులో 3,000 కిలోమీటర్ల మేర సీసీ…
ఏపీ రాష్ట్రంలో వరుస తుపానుల కారణంగా వర్షాలు తీవ్రంగా కురుస్తున్నాయి. అనేక జిల్లాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, నదులు, వాంగులు పొంగి పోయాయి, దీంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిరంతర వర్షాల కారణంగా కొన్ని ప్రాణాలు పోయాయి, రైతులు పంటలు నష్టపోయారు. ఇప్పుడే ఆ నష్టాల నుంచి తేరుకోకముందే, మరోసారి భారీ వర్షాలు కురవబోతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు…
CM Revanth Reddy: వికారాబాద్ జిల్లా నిన్న సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో దసరా సంబరాల తర్వాత నేరుగా సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ చేరుకున్నారు. రేవంత్ రెడ్డి రాకతో కొడంగల్ నియోజకవర్గం సందడి వాతావరణం నెలకొంది.
Whats Today: విజయవాడ : రేపు కంకిపాడు రానున్న డిప్యూటీ సీఎం పవన్.. పల్లె పండుగ వారోత్సవాలు కార్యక్రమంలో పాల్గొన్న పవన్.. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న పల్లె పండుగ
దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లాలోని కొండారెడ్డిపల్లికి చేరుకుని, అక్కడ జరిగే దసరా ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో గ్రామస్తులు సీఎం రేవంత్ రెడ్డికి బోనాలు, బతుకమ్మలు, కోలాటాలతో ఘన స్వాగతం పలుకుతారు. సీఎం గా రేవంత్ రెడ్డి స్వగ్రామంలో పర్యటించడం ఇది మొదటిసారి. ఆయన కొండారెడ్డిపల్లిలో రూ. 72 లక్షల వ్యయంతో నిర్మించిన మోడల్ గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. రూ. 72 లక్షల వ్యయంతో నిర్మించబడిన…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో 36.5 కోట్లతో నిర్మించిన 2.5 మెగావాట్ల పవర్ ప్లాంట్ ను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి విజయదశమి ఇది అని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలు విజయాలు పొందే విధంగా ప్రభుత్వం తరపున అండ గా ఉంటామని హామీ…
జగిత్యాల జిల్లాలో అడిషనల్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ మధ్య వివాదం ముదిరింది. గతవారం ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ మద్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. అయితే.. దసరా పండుగా (శమీపూజ) పై అధికారుల వివాదం ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. అనాదిగా 100 సంవత్సరాల నుండి వస్తున్న ఆచారానికి అధికారుల ఇగో వల్ల మంట కలుస్తుందని జగిత్యాల ప్రజల నిరసన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమీ లేక మోతె గ్రామపంచాయతీ ట్రాక్టర్ ని అద్దెకు తీసుకొచ్చారు రెవెన్యూ…
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం దసరా పండుగ సందర్భంగా ఎల్లమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సామాజిక, రాజకీయ, ఆర్థిక సర్వే కోసం జీవో 18ను తీసుకొచ్చారని వివరించారు. ఈ సర్వే 60 రోజుల పాటు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. బీసీ కులగణనను పూర్తిగా సేకరించిన తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు (గ్రామ్ పంచాయతీ ఎన్నికలు) జరుగుతాయని స్పష్టత ఇచ్చారు. కులగణన ప్రక్రియలో రాష్ట్ర ప్రజలు…
చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచించే పండుగలైన దసరా, దుర్గాపూజలను దేశం జరుపుకుంటున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం పౌరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. హోంమంత్రి తన అధికారిక X హ్యాండిల్లో పోస్ట్లో ఇలా అన్నారు, “అందరికీ ‘విజయదశమి’ శుభాకాంక్షలు. అధర్మం యొక్క చీకటి ఎంత దట్టమైనప్పటికీ, సత్యం ఆధారంగా ధర్మం యొక్క కాంతి విజయం శాశ్వతమైనది. “దానికి ప్రతీక. పాపంపై పుణ్యం సాధించిన ‘విజయదశమి’ అనేది మనల్ని ఎల్లప్పుడూ వివేకం , సత్యం యొక్క…