టాలీవుడ్ సీనియర్ హీరో మాస్ మహారాజా రవితేజ సినిమాల సంగతి తెలిసిందే.. ప్లాప్ సినిమాలు పలకరిస్తున్నా కూడా ఎక్కడా తగ్గలేదు.. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడు.. రీసెంట్ గా రవితేజ ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా పర్వాలేదనిపించింది.. ఇప్పుడు తన 75వ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తో ఈ సినిమాను చెయ్యనున్నారు.. తాజాగా ఉగాది సందర్బంగా ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు మేకర్స్..
రవితేజ అంటే మాస్ అనే విధంగా ఈ మధ్య భారీ యాక్షన్ సినిమాల్లో నటించాడు.. గత కొన్నేళ్లుగా ధమాకా తర్వాత ఒక్క సినిమా కూడా భారీ విజయాన్ని అందుకోలేదు.. కొత్త ప్రయోగాలను చెయ్యడం తో పాటుగా కొత్త డైరెక్టర్ లతో కూడా సినిమాలు చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు మరో కొత్త డైరెక్టర్ తో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. ఉగాదిని పురస్కరించుకొని రవితేజ ల్యాండ్‌మార్క్ చిత్రం ప్రకటన వచ్చింది. ఇది రవితేజ శైలిలో ఉండే మాస్ ఎంటర్టైనర్. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
తాజాగా విడుదల చేసిన పోస్టర్ ను చూస్తేనే ఈ సినిమా ‘దావత్’లా ఉండబోతుందనే అభిప్రాయం కలుగుతోంది. ఊరి జాతరను చూపిస్తూ సృజనాత్మకంగా రూపొందించిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా పోస్టర్ లో కళ్ళద్దాల మీద ‘RT 75’ అని రాయడం బాగుంది. అలాగే పోస్టర్ మీద “రవన్న దావత్ ఇస్తుండు.. రెడీ అయిపోండ్రి” అని రాశి ఉంది.. అలాగే “హ్యాపీ ఉగాది రా భయ్” అని తెలంగాణ యాసలో రాసి ఉండటం గమనించవచ్చు. దీనిని బట్టి చూస్తే తెలంగాణ నేపథ్యంలో సాగే చిత్రమని అర్థమవుతోంది. ఈ సినిమాలో రవితేజ పాత్ర పేరు “లక్ష్మణ భేరి” అని తెలిపిన మేకర్స్..సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. రచయిత భాను భోగవరపు దర్శకత్వం వహించగా,సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు.. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న పోస్టర్ లో పేర్కొన్నారు..