పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గత ఏడాది నటించి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న సినిమా సలార్.. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను కొల్లగొట్టింది.. ఓటీటిలో కూడా విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా మంచి టాక్ ను అందుకుంది. ఇక టీవీ లో ప్రసారం అయ్యేందుకు రెడీ అవుతుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..
కేవలం సినిమాను చూడటం మాత్రమే కాదు.. సినిమాను చూస్తూనే సలార్ బైకును పొందే అవకాశం ఉంది.. ఏంటి నిజమా అనుకుంటున్నారుగా.. అవును మీరు విన్నది అక్షరాల నిజం.. సలార్ సీజ్‌ఫైర్ మూవీ ఏప్రిల్ 21 న ఆదివారం స్టార్ మాలో టెలికాస్ట్ కానుంది. ఈ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 8 గంటల వరకూ కొనసాగనుంది.. ఈ సినిమాను చూస్తూ బైక్ ను గెలుచుకోవచ్చు..
అదేలాగంటే.. సలార్ మూవీని నిర్మించిన హోంబలె ఫిల్మ్స్ తమ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.. అలాగే సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు.. ఈ సినిమాను చూస్తున్నంతసేపు స్క్రీన్ పై ఒకవైపు బైకు కనిపిస్తుంది.. ఆ బైక్ ఎన్ని సార్లు స్క్రీన్ మీద కనిపించిందో లెక్కబెట్టాలి.. తర్వాత ఎస్సెమ్మెస్ లైన్లు ఓపెన్ అవుతాయి. అప్పుడు 9222211199 నంబర్ కు SALAAR వేసి పంపించాలి. ఎస్సెమ్మెస్ లైన్లు ఏప్రిల్ 21 రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమవుతాయి.. ఈ న్యూస్ తో సోషల్ మీడియా దద్దరిల్లి పోతుంది.. సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు..