పోలింగ్ అనంతర అల్లర్లపై సిట్ విచారణ నేడు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నిన్నటి నుంచే సిట్ రంగంలోకి దిగింది. తాడిపత్రి, నరసరావు పేట, తిరుపతిలో శనివారం నుంచే సిట్ టీమ్ విచారిస్తోంది. ఇప్పటికే అల్లర్లపై నమోదైన కేసులను సిట్ బృందం పరిశీలించింది.
బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ గురించి అందరికీ తెలుసు.. ఎంతోమంది కమెడియన్లకు మంచి లైఫ్ ఇచ్చింది.. అందులో పవిత్ర కూడా ఒకటి.. ఈమె గురించి అందరికీ తెలుసు.. పలు స్కిట్ లలో తన కామెడితో కడుపుబ్బా నవ్వించేస్తుంది.. అతి తక్కువ కాలంలోనే మంచి ఫెమ్ ను అందుకుంది.. తాజాగా ఈమె కారకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. అయితే చిన్న గాయాలతో బయట పడిందని తెలుస్తుంది.. ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పింది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి…
హీరో నితిన్ హిట్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నాడు.. ఈ మధ్య వచ్చిన సినిమాలు ఏవి మంచి హిట్ టాక్ ను అందుకోలేక పోయాయి.. దాంతో కాస్త గ్యాప్ తీసుకున్న నితిన్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడు.. రెండు సినిమాలను ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే చూస్తున్నాడు. ప్రస్తుతం నితిన్ ఆశలన్నీ రాబిన్‌హుడ్, తమ్ముడు చిత్రాలపైనే పెట్టుకున్నారు.. తమ్ముడు సినిమాకు తాజాగా హీరోయిన్ దొరికేసినట్లు తెలుస్తుంది.. ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది..…
ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై 13 మంది సభ్యులతో కూడిన సిట్ బృందం విచారణ కొనసాగుతోంది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి ఏకపక్షంగా వ్యవహరించిన అధికారుల తీరుపై విచారిస్తోంది.
ఇటీవల తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీఆర్‌ఎస్‌పై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తప్పుపట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో.. ఆమె బీఆర్ఎస్‌కు మద్దతుగా మాట్లాడారని.. మళ్లీ విజయశాంతి పార్టీమారుతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే.. దీనిపై తాజాగా ఆమె క్లారిటీ ఇచ్చారు. దక్షిణ భారత ప్రాంత ప్రజల రాజకీయ భావోద్వేగాలు ఎలా ఉంటాయో… గత, ఇప్పటి పరిస్థితులను ఉదహరించి తాను ట్వీట్ చేసినట్లు తెలిపారు. దక్షిణాది ప్రాంతీయ పార్టీల పట్ల కాంగ్రెస్…
కడప జిల్లా జమ్మలమడుగులో పరిస్థితులను ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సమీక్షించారు. ఎన్నికల రోజు పోలీసుల పనితీరు భేష్ అంటూ ఆయన ప్రశంసించారు. జమ్మలమడుగులో ఎన్నికల రోజు తలెత్తిన వివాదాలను పోలీసులు చాకచక్యంగా అణిచివేశారని.. పోలీసులు ప్రాణాలకు తెగించి చాలెంజింగ్‌గా పరిస్థితులను అదుపు చేశారని చెప్పుకొచ్చారు.
ఏపీలో ఎన్నికల సమయంలో, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. కంటైనర్లు, బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దని పెట్రోల్ బంక్ నిర్వాహకులను ఎన్నికల సంఘం ఆదేశించింది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలో ఏమేం సిఫారసులున్నాయి.. ప్రభుత్వం తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్రెడ్డి ఆరా తీశారు. శనివారం సాయంత్రం సచివాలయంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఆయన చర్చలు జరిపారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సీఎం వెంట ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ…