బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ గురించి అందరికీ తెలుసు.. ఎంతోమంది కమెడియన్లకు మంచి లైఫ్ ఇచ్చింది.. అందులో పవిత్ర కూడా ఒకటి.. ఈమె గురించి అందరికీ తెలుసు.. పలు స్కిట్ లలో తన కామెడితో కడుపుబ్బా నవ్వించేస్తుంది.. అతి తక్కువ కాలంలోనే మంచి ఫెమ్ ను అందుకుంది.. తాజాగా ఈమె కారకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. అయితే చిన్న గాయాలతో బయట పడిందని తెలుస్తుంది.. ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పింది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది..
ఈ అమ్మడు టిక్ టాక్ వీడియోలతో మొదటగా పాపులర్ అయింది. ఆ తర్వాత జబర్దస్త్‌లోకి అడుగు పెట్టి ఆకట్టుకుంది. తనదైన కామెడీతో చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమెకు మంచి ఆఫర్లు వచ్చాయి. ఎన్నో షోలు, ఈవెంట్లలో భాగమై ఆడియెన్స్ అలరిస్తూ లైఫ్‌ను జబర్దస్త్‌గా గడుపుతోంది..
కేరీర్ పరంగా ఈ అమ్మడుకు మంచి పాపులారిటిని అందుకుంది.. అతి తక్కువ కాలంలోనే వరుస అవకాశాలను అందుకుంటుంది.. అలాగే పర్సనల్ లైఫ్ విషయానికొస్తే..సంతోశ్ అనే కుర్రాడితో ప్రేమాయణం సాగించింది. ఈ విషయాన్ని తనే సోషల్ మీడియా ద్వారా అఫీషియల్‌గా కూడా తెలిపింది. అతడితో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది.. ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది.. చివరకు ఎందుకో తెలియదు కానీ బ్రేకప్ చెప్పేసింది.. ప్రస్తుతం కేరీర్ పై ఫోకస్ పెట్టింది..