Wine Shops Closed: ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు బ్యాడ్ న్యూస్ ఏపీ వ్యాప్తంగా మూడు రోజుల పాటు మద్యం షాపులు మూసివేయనున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం షాపులు మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. వరుసగా మూడు రోజులు మద్యం షాపులు తెరుచుకోవని తెలియడంతో మందుబాబులు షాపుల వద్ద క్యూ కట్టారు. మూడు రోజులకు సరిపడా మద్యం కొనుగోలు చేస్తు్న్నారు. రాష్ట్రంలోని మద్యం షాపుల ముందు రద్దీ కనిపిస్తుంది. జూన్ 6న ఉదయం తిరిగి వైన్ షాపులు తెరుచుకోనున్నాయి.
Read Also: NHAI: నేటి అర్ధరాత్రి నుండి బాదుడే.. టోల్ ఛార్జిలను 5% పెంపు..
ఇదిలా ఉండగా.. తెలంగాణలో కూడా వైన్ షాపులు మూసివేయనున్నారు. జూన్ 4న తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా వైన్ షాపులు మూసివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో జూన్ 4న రోజంతా డ్రై డేగా ఉండనుంది. జూన్ 5వ తేదీ ఉదయం మద్యం షాపులు తెరుచుకోనున్నాయి.