డ్రగ్స్ ఇన్స్పెక్టర్ లకు నియామక పత్రాలను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నకిలీ మందుల తయారీదారుల పై ఉక్కుపాదంతో అణిచివేయడానికి చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో నకిలీ మందుల నివారణకై నిరంతర పర్యవేక్షణ కోసం నూతనంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ నియామకాన్ని చేపట్టింది. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ను బలోపేతానికి చర్యలు చేపట్టామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. నియామక పత్రాలను అందుకున్న అభ్యర్థులకు దిశా నిర్దేశం చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహ…
జంతు సామ్రాజ్యానికి సంబంధించిన అద్భుతమైన వీడియోలు కొన్నిసార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు ఎంత అద్భుతం, ఇది సాధ్యమేనా అని అనిపిస్తుంది. ప్రస్తుతం ఇలాంటి సర్ప్రైజింగ్ అండ్ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది, అక్కడ వర్షం నీటిలో ఓ చిన్న ఎలుక తడిసిపోయి, వర్షంలో గంతులు వేసుకుంటూ.. ఆనందంలో దూకి ఉల్లాసంగా గడిపింది. ఈ క్యూట్ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. మీరు ఎండలో తడుస్తున్నప్పుడు, హఠాత్తుగా వర్షం పడితే,…
తెలంగాణలోని మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ నాయకుడు ఈటల రాజేందర్ తన పాత్ర , బాధ్యతపై పార్టీ నిర్ణయిస్తుందని అన్నారు. ఆదివారం సాయంత్రం జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ , ఆయన మంత్రి మండలి ప్రమాణ స్వీకారోత్సవం గురించి మీడియాతో మాట్లాడుతూ , “ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , క్యాబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వేడుక ఘనంగా జరిగింది. భారతదేశం వివిధ రాష్ట్రాలు, సంస్కృతులు, కులాలు , మతాలతో…
రాజమండ్రి వద్ద గోదావరిలో క్రమేపీ నీటిమట్టం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలోకి నీరు చేరడంతో నీటిమట్టం పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 13.79 మీటర్లకు నీటిమట్టం చేరింది.
వైసీపీకి షాక్ తగిలింది. నెల్లూరు మేయర్ స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ వైసీపీకి రాజీనామా చేశారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంట నడుస్తామని వారు వెల్లడించారు.
ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం 11.27 గంటలకు గన్నవరం సమీపంలో కేసరపల్లిలో ప్రమాణస్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమం కోసం అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ప్రధాని మోడీ సహా పలువురు జాతీయ నేతలు హాజరుకానుండడంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం టోకెన్ లేని భక్తులకు 16 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వదర్శనానికి 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపీలో సంస్థాగత స్థాయి మార్పుల ప్రక్రియ ప్రారంభం కానుంది. కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపిక పెండింగ్లో ఉంది. ఇప్పుడు జేపీ నడ్డా ప్రభుత్వంలో చేరిన తర్వాత.. పార్టీకి కొత్త జాతీయ అధ్యక్షుడు వస్తారనే విషయం మరింత స్పష్టమైంది. అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం జనవరిలో పూర్తి కావడంతో లోక్‌సభ ఎన్నికల వరకు పొడిగించారు.
ఆంధ్రప్రదేశ్లో వేసవి సెలవులను ఈ నెల 12 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం 12న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా.. తాజా మార్పుతో 13న రీఓపెన్ అవుతాయని సర్కారు తెలిపింది.