గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) విడుదల చేసింది. అక్టోబర్ 21వ తేదీ నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నట్లు షెడ్యూల్‌ను విడుదల చేసింది టీజీపీఎస్సీ. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మీడియంలలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి పేపర్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ నెల 9వ తేదీన గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. త్వరలోనే…
ఓ వ్యక్తి చనిపోవడంతో అతడి అంతిమయాత్రను నిర్వహించారు కుటుంబీకులు. అయితే.. ఇంటి నుంచి స్మశానం వరకు డప్పుచప్పుళ్లతో బాణసంచాలు కాల్చుతూ సదరు వ్యక్తి భౌతికకాయాన్ని తీసుకువెళ్తున్నారు బంధువులు. అయితే.. అంతిమయాత్ర ఊరేగింపు కొనసాగుతుండగా.. బాంబులు పేల్చడంతో.. అక్కడ సమీపంలో ఉన్న తేనెతెట్టుకు తగిలింది. ఇంకేముంది.. ఆ తేనెతెట్టుకున్న తేనటీగలు ఒక్కసారిగి అంతిమయాత్ర ఊరేగింపులో ఉన్న జనాలపై దాడి చేయడం ప్రారంభించారు. దీంతో.. అంతిమయాత్రలోని మృతదేహాన్ని రోడ్డుపైనే వదిలేసి బంధువులు తలోవైపు పరుగులు తీశారు. United Kingdom: మా…
మడికొండ సత్య సాయి కన్వెన్షన్ హాల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. వరంగల్ పార్లమెంట్ ఎన్నికలలో భారీ మెజారిటీతో విజయం సాధించిన డాక్టర్ కడియం కావ్య పరిచయ, ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర అటవీ , దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను అంధ్రాలో కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తానని మోడీకి చెప్పానని చంద్రబాబు ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో చెప్పారని, ఏడు మండలాలను ఆంధ్రాలో కలపడంపై తెలంగాణ బంద్ కు బీఆర్ఎస్ పిలుపినిచ్చిందని మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్,పెద్ది సుదర్శన్ రెడ్డి. ఇవాళ వారు మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలుగా మేము కొట్లాడామని, లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టు ఆంధ్రాకు వెళ్ళిందన్నారు. ఏడు మండలాలపై సీఎం రేవంత్ రెడ్డి ఒక్క మాట మాట్లాడలేదని, చంద్రబాబు…
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంపై విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలపై జస్టిస్ చంద్ర ఘోష్ కమిటీ విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రాజెక్టును సందర్శించిన కమిటీ.. ఇప్పుడు విచారణను వేగవంతం చేసింది. అయితే.. ఈనేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ మాట్లాడుతూ.. ఈరోజు ఏజెన్సీలతో సమావేశం అయ్యాము. వాళ్లను అఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పానని, గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోవాలని అఫిడవిట్ ఫైల్ చేయమన్నాని ఆయన తెలిపారు. టైం బౌండ్…
విద్యుత్ కొనుగోళ్ళు, కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణపై మాజీమంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. ఇవాళ ఆయన సూర్యాపేట జిల్లాలో మాట్లాడుతూ.. విచారణ కమీషన్లు వాటి పని అవి చేసుకుంటాయని, ప్రభుత్వం ఎందుకు లీకులు ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరంలో నీళ్ళు నిలిపి సాగు నీరు అందించకుండా తప్పు చేస్తున్నారని, నీళ్ళు, విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. పత్తి విత్తనాల కొరతలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని, పత్తి విత్తనాల బ్లాక్ దందాలో ఓ మంత్రి…
ఆంధ్రప్రదేశ్‌లో నూతన సర్కారు కొలువుదీరింది. మంత్రివర్గం ప్రమాణస్వీకారం ముగిసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయిస్తారనే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.
ఏపీ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి.