కడప జిల్లా వాసులకు గుడ్‌న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కడప వాసులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్ అందించింది. నవంబర్ 1 నుంచి కడప మీదుగా మరో రెండు రైళ్లు రాకపోకలు సాగించనున్నాయని కడప రైల్వే సీసీఐ ఎం.యానాదయ్య వెల్లడించారు. ఈ రెండు రైళ్లు కడప జిల్లాలో పలు స్టేషన్‌ల మీదుగా ప్రయాణిస్తాయని తెలిపారు. ముంబై-చెన్నై మధ్య ప్రతిరోజూ నడిచే 01459 నంబరు గల రైలు ముంబైలో మధ్యాహ్నం 12:45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3:59 గంటలకు కడప జిల్లా ఎర్రగుంట్లకు, ఉదయం 4:43 గంటలకు కడపకు, ఉదయం 5:29 గంటలకు రాజంపేటకు చేరుకుంటుందని వివరించారు.
Also Read: బద్వేల్‌లో రీపోలింగ్ జరపాలి : సోము వీర్రాజు
Also Read
చెన్నై-ముంబై మధ్య నడిచే 01460 నంబర్ గల రైలు చెన్నైలో మధ్యాహ్నం 1:25 గంటలకు బయల్దేరి రైల్వే కోడూరుకు సాయంత్రం 4:44 గంటలకు, రాజంపేటకు సాయంత్రం 5:09 గంటలకు, కడపకు 5:53 గంటలకు, ఎర్రగుంట్లకు 6:29 గంటలకు చేరుకుంటుందని తెలిపారు. అటు లోకమాన్య తిలక్-చెన్నై మధ్య నడిచే 01479 నంబర్ గల వీకెండ్ రైలు ముంబై శివారులోని లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి మధ్యాహ్నం 1:20 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున కడప జిల్లా ఎర్రగుంట్లకు 4:59 గంటలకు, కడపకు 5:43 గంటలకు చేరుకుంటుంది. చెన్నై-లోకమాన్య తిలక్ మధ్య నడిచే 01480 నంబరు గల రైలు చెన్నైలో మధ్యాహ్నం 3:50 గంటలకు బయలుదేరి రాత్రి 8:23 గంటలకు కడపకు, 8:59 గంటలకు ఎర్రగుంట్లకు చేరుకుంటుందని రైల్వే సీసీఐ వివరించారు.
తాజావార్తలు
-
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
-
UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
-
Telangana Agriculture : పప్పుధాన్యాల సాగులో తెలంగాణకు రెండో స్థానం.. కేంద్రానికి కీలక ప్రతిపాదనలు
-
Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
-
Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!