కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పామర్రు మండలం కాపవరం వద్ద ఓ కారు అదుపుతప్పి డివైడర్ దాటి బైక్ ను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కారు దగ్డమైంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మొవ్వ మండలం కాజా గ్రామానికి చెందిన కామేశ్వర రెడ్డి (24), ఉమాకాంత్ (20)గా పోలీసులు గుర్తించారు. మచిలీపట్నం నుంచి పామర్రు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.