తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎం.కే స్టాలిన్ అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ముందుకు వెళుతున్నారు. ఆ మధ్య అర్థరాత్రి ఓ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన సీఎం స్టాలిన్, ఇటీవల ఓ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అందరినీ అవాక్ చేశారు. అంతేకాకుండా మొన్నటికి మొన్న రోడ్డుపై తన కాన్వాయ్ వెళ్తుండగా వెనుకనుంచి వస్తున్న అంబులెన్స్‌కు సైడ్ ఇచ్చి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.
ఇలా ఊహించని రీతిలో తనదైన శైలితో సీఎం స్టాలిన్ ముందుకు సాగుతున్నారు. తాజాగా మరో అదిరిపోయే సీన్ చూడోచ్చు.. చెంగల్పట్టు జిల్లా తిరుక్కలుక్కుంరం సర్కిల్, పూన్చేరిలో నివాసముంటున్న నరిక్కువర్, ఇరులర్ వర్గానికి చెందిన 282 మంది లబ్దిదారులకు ప్రభుత్వ సంక్షేమ సహాయాన్ని సీఎం స్టాలిన్ అందించారు.
అంతేకాకుండా వారు కూర్చన్న కుర్చీల మధ్యే తనూ ఒక ప్లాస్టిక్ కుర్చీలో కూర్చోని లబ్దిదారులతో ఫోటో దిగారు. ఈ సన్నివేశాన్ని సంబంధించిన ఫోటోను తమిళనాడు సీఎంవో ట్విట్టర్ వేదికగా పంచుకుంది. ఈ ఫోటో ను చూసిన ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
செங்கல்பட்டு மாவட்டம், திருக்கழுக்குன்றம் வட்டம், பூஞ்சேரியில் வசிக்கும் நரிக்குறவர் மற்றும் இருளர் இனத்தைச் சேர்ந்த 282 நபர்களுக்கு, மாண்புமிகு முதலமைச்சர் @mkstalin அவர்கள் அரசு நலத்திட்ட உதவிகளை வழங்கி, பயனாளிகளுடன் குழு புகைப்படம் எடுத்துக் கொண்டார். pic.twitter.com/uqphIMpodl
— CMOTamilNadu (@CMOTamilnadu) November 4, 2021