ఢిల్లీలోని నరేలా పారిశ్రామిక ప్రాంతంలో షూ తయారీ కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేస్తున్నారు. 30 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. షాట్‌సర్య్కూట్ కారణంగా ప్రమాదం సంభవించి ఉండొచ్చని అగ్నిమాపక సిబ్బంది ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. షూ తయారీకి సంబంధించిన ఫ్యాక్టరీ కావడంతో భారీగా…
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ రోజు తెలంగాణ భవన్‌లో విసృతస్థాయి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు కేసీఆర్ పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లాలని.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మొండి వైఖరిని రైతులకు చెప్పాలని సూచించారు. ఈ సమావేశం అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. వీడియోను కింద ఉన్న లింక్‌లో వీక్షించండి..
అసలు చట్టాలు అంటు ఒకటిఉన్నాయని.. స్త్రీతో అమర్యాదగా ప్రవర్తిస్తేనే చట్టపరంగా చర్యలుంటాయని తేలియని సమాజంలో బతుకుతున్నారా..? అనే ప్రశ్నలు కొన్నికొన్ని సార్లు వ్యక్తమవుతుంటాయి. ఎందుకంటే ఎన్నిచట్టాలు చేసినా కొందరు కామాంధులు మాత్రం మారడం లేదు. స్త్రీల పట్ల అనుచితంగా వ్యవహరించినవారు కఠినంగా శిక్షింపబడుతున్నా కొంచెం కూడా భయపడకుండా నేరాలు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో మరో ఉదాంతం బయట పడించి. బోరబండుకు చెందిన ఓ మహిళ కూలీ పని చేసుకునే దగ్గర వెంకట్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.…
తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షత విస్తృతస్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ హజరయ్యారు. అయితే ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు జనాల్లో ఉండాలని, ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా మీరు జనాల్లో ఉండకపోతే ఎవరు ఏమి చేయలేరని ఎమ్మెల్యేలకు చురకలు అంటించారు. రైతు వేదికల్లో రైతులతో సమావేశాలు పెట్టండని, కేంద్రం ధాన్యం కొనుగోలు చేయటం లేదన్న విషయాన్ని రైతులకు చెప్పండని వివరించారు. కేంద్రం చేతులెత్తేసింది…
ఏపీలో రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పనెక్కర్లేదు. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా పోటీ మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, టీడీపీలకే ఉంటుంది. వార్డు మెంబర్ ఎన్నిక నుంచి ముఖ్యమంత్రి పీఠం వరకు టీడీపీ, వైసీపీ నేతల మధ్య అసలైన పోరు ఉంటుంది. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ పౌరులకు తెలియంది కాదు. అయితే రాష్ట్ర విభజన తరువాత మొదటి సారి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను నవ్యాంధ్ర ప్రదేశ్‌గా ఎన్నో హంగులతో…
ఢిల్లీ అతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సారి భారీగా వజ్రాలు పట్టుబడ్డాయి. రోజు రోజుకు కేటుగాళ్లు మితిమీరిపోతున్నారు. అధికారుల కంటబడకుండా ఉండేందుకు కొత్తకొత్త విధంగా విలువైన వస్తువులనై అక్రమంగా తరలిస్తున్నారు. అయితే తాజాగా హాంగ్‌కాంగ్ నుంచి ఢిల్లీకి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి బ్యాగ్‌లో కస్టమ్స్ అధికారులు భారీగా వ్రజాలను గుర్తించారు. అధికారులకు దొరక్కుండా ఉండేందుకు ప్లాస్టిక్ కవర్స్‌లో వజ్రాలు ప్యాకింగ్ చేసి స్కానింగ్‌లో తెలియకుండా ఉండేందుకు కార్బన్ పేపర్‌ను చుట్టారు. అయితే అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు…
అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ చేపట్టిన 45 రోజుల మహాపాదయాత్ర ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు తిరుపతిలో రాజధాని రైతులు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ నేతలు హజరయ్యారు. అంతేకాకుండా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు కూడా హజరయ్యారు. అయితే ఈ సభకు హజరయ్యేందుకు చంద్రబాబు కూడా తిరుపతి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారిని దర్శించుకొని రైతులు నిర్వహిస్తున్న మహాసభ ప్రాంగణానికి…
టీడీపీపై మరోసారి మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు చేశారు. 2016-17లో ఓఆర్ఆర్ కట్టాలంటే 8వేల ఎకరాలు అవసరం అని నివేదిక ఇచ్చారని, దీనికి 17 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేసి అప్పట్లో చంద్రబాబు కేంద్ర సహాయం అడిగారని ఆయన అన్నారు. భూ సేకరణ చేసి ఇస్తే చూస్తామని కేంద్రం చెప్పిందని, కేంద్రం అడిగినా 2018 వరకు కనీసం డీపీఆర్ కూడా ఇవ్వలేక పోయారని ఎద్దేవా చేశారు. అప్పడు వారు అధికారంలో ఉన్నప్పుడు చేయకుండా…
యావత్త ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేసిన కరోనా మహమ్మారి కొత్త కొత్త రూపాలతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. మొన్నటి వరకు ప్రపంచ దేశాలు డెల్టా వేరియంట్‌తోనే సతమతవుతున్నాయి. ఇప్పడిప్పుడే కొన్ని దేశాలు డెల్టా వేరియంట్ నుంచి బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పడు ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే వివిధ దేశాలకు వ్యాప్తి చెందిన ఈ వేరియంట్ ఇటీవల భారత్‌లోకి కూడా ప్రవేశించి…
ఏపీ ప్రభుత్వ ఉద్యోగలు 11వ పీఆర్సీపై స్పష్టత ఇవ్వాలంటూ నిరసనలు తెలిపారు. దీంతో ఏప ప్రభుత్వం సీఎస్ తో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. అయితే సీఎస్ కూడిన కమిటీ 14.29తో కూడిన ఫిట్ మెంట్ ఉద్యోగులకు అమలు చేయాలంటూ సీఎం జగన్ కు నివేదిక సమర్పించింది. దీంతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నేతలు సీఎస్ కమిటీ ఇచ్చిన నివేదిక ఉద్యోగులకు పూర్తి వ్యతిరేకంగా ఉందని వెల్లడించారు. దీంతో ఈ రోజు ఆర్థిక శాఖ మంత్రి…