కేంద్ర మరో కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టనుంది. శీతాకాల సమావేశాలు గత నెలలో ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో గత సంవత్సరం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ పార్లమెంట్‌లో ఆమోదించారు. తాజాగా ఓటరు జాబితాలో డూప్లికేషన్‌ను నివారించేం దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో నేడు లోక్ సభ ముందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నికల చట్టాల బిల్లు 2021 ప్రవేశపెట్టనుంది. అయితే కొత్త ఓటర్ల గుర్తింపు ధృవీకరణకు ఆధార్‌ను వినియోగించటం, ఆధార్ నెంబర్ ఇవ్వకపోయినా ఓటు…
వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలో నేటి నుంచి ఈ నెల 25వరకు సుపరిపాలన వారోత్సవాలు జరుగనున్నాయి. వారోత్సవాల్లో భాగంగా ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సుపరిపాలన వారోత్సవంపై కేంద్ర ప్రచారం ప్రారంభించనుంది. ఏపీలో సినిమా టికెట్ల ధరలపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌లో అప్పీల్‌కు వెళ్లింది. ఈ నేపథ్యంలో టికెట్ల ధరలపై హైకోర్టులో విచారణ జరుగనుంది. శీతాకాల పార్లమెంట్…
పంజాబ్ అమృతసర్‌లోని స్వర్ణ మందిరంలో ఓ ఆగంతకుడు చొరబడ్డాడు. గురుగ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేసేందుకు ఆగంతకుడు ప్రయత్నించగా వెంటనే గుర్తించిన ఎస్‌జీపీసీ సిబ్బంది దుండగిని పట్టుకున్నారు. అయితే సాయంత్రం 6 గంటలకు ప్రార్థనలు చేసే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఎస్‌జీపీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే ఆగ్రహంతో రగిలిపోతున్న భక్తులు ఒక్కసారిగా ఆ దుండగుడిపై దాడి చేశారు. దీంతో ఆ వ్యక్తి మరణించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు…
యావత్తు ప్రపంచ దేశాలను భయం గుప్పిట్లోకి నెట్టిన కరోనా మహమ్మారి రోజురోజుకు తీవ్రంగా మారుతోంది. రకరకాలుగా రూపాంతరాలు చెందిన మానవజాతిని శాసిస్తోంది. ఇప్పటికే డెల్టా వేరియంట్‌తో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. ఇప్పడు దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ మరింత భయాందోళకు గురి చేస్తోంది. ఇప్పటికే ఈ వేరియంట్ భారత్‌లోకి కూడా ప్రవేశించింది. పలు రాష్ట్రాల్లో వ్యాపించిన ఒమిక్రాన్ దాని ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో ఎయిడ్స్ డాక్టర్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా…
తెలంగాణలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. తెలంగాణలోని పలు జిల్లా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత పది సంవత్సారాలలో చూడనటువంటి ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే తాజా శనివారం రోజున తెలంగాణలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ నమోదు కావడం గమనార్హం. ఈ రోజు హైదరాబాద్‌లోని కూడా చలి తీవ్రత పెరిగిందని అధికారులు వెల్లడించారు. తాజా నివేదిక ప్రకారం సంగారెడ్డిలో నేడు…
ఈ నెల 9న ఢిల్లీలోని రోహిణి కోర్టులో బాంబు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు నివ్వెరపోయే విషయాలు తెలిశాయి. డీఆర్డీవోకు చెందిన భరత్ భూషణ్ అనే శాస్త్రవేత్తకు తన పక్కింట్లో ఉండే న్యాయవాది అమిత్ విశిష్ట్ కు మధ్య గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరువురు ఒకరిపైఒకరి కేసులు పెట్టుకున్నారు కూడా. అయితే లాయర్‌ను ఎలాగైనా అంతమొందించాలనుకున్నాడు…
మద్యంపై పన్ను రేట్లలో మార్పులు చేస్తూ మరోమారు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాట్, అదనపు ఎక్సైజు డ్యూటీ ప్రత్యేక మార్జిన్లల్లో హేతుబద్దత కోసం ఏపీ ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ నేపథ్యంలో వ్యాట్, అదనపు ఎక్సైజు డ్యూటీలో హేతుబద్దత ద్వారా రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గనున్నాయి. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ వెరెటీలపై 5-12 శాతం మేర ధరలు తగ్గే అవకాశం ఉండగా, ఇతర అన్ని కేటగిరీల మద్యంపై 20 శాతం వరకూ ధరలు…
మరోసారి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణీకుల వద్ద 1.13 కోట్ల విలువ చేసే 1.42 కేజీల బంగారం తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులను కస్టమ్స్ అధికారు సీజ్ చేశారు. కస్టమ్స్ అధికారులను బురడి కొట్టించడానికి బంగారాన్ని కార్టన్ బాక్స్ మధ్య భాగంలో దాచి కేటుగాళ్లు తరలించేందుకు యత్నించారు. అయితే 5 మంది ప్రయాణీకుల కదలికలపై అనుమానంతో కస్టమ్స్ బృందం వారిని అదుపులోకి తీసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తమదైన…
రుణయాప్‌ల పేరుతో అమయాకులకు ప్రజల అవకాశాన్ని సొమ్ముచేసుకుంటున్న వారిపై ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ (ఈడీ) కొరడా ఝుళిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా రుణ యాప్ ల కేసులో బ్యాంకింగేతర సంస్థ సీఈఓను ఈడీ అరెస్టు చేసింది. కుడోస్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ పవిత్ర ప్రదీప్ వాల్వేకర్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 39 ఫిన్ టెక్ కంపెనీలకు కుడోస్ సర్వీస్ ప్రొవైడర్ గా వ్యవహరించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దీంతో కుడోస్ సంస్థ…
వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా బీజేపీ చీఫ్ సోము వీర్రాజు నిప్పులు చేరిగారు. హిందువులన్నా, హిందూ ఆలయాలన్నా జగన్ ప్రభుత్వానికి చులకనగా కనిపిస్తున్నట్లుందని, హిందువుల సహనాన్ని పరీక్షించాలని చూస్తున్నట్లుందని ఆయన మండిపడ్డారు. ఒక్కసారి హిందువులు తలచుకుంటే తమ ఓటు ద్వారా మీ ప్రభుత్వానికి భవిష్యత్తు లేకుండా చేస్తారని హెచ్చరించారు. మొన్న త్రిపురాంతకంలో అయ్యప్పస్వామి విగ్రహాన్ని తొలగించారు, నేడు గిద్దలూరులో ఏకంగా ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూల్చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఎన్నో సంఘటనలు గతంలో…