ఢిల్లీలోని నరేలా పారిశ్రామిక ప్రాంతంలో షూ తయారీ కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేస్తున్నారు. 30 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
షాట్‌సర్య్కూట్ కారణంగా ప్రమాదం సంభవించి ఉండొచ్చని అగ్నిమాపక సిబ్బంది ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. షూ తయారీకి సంబంధించిన ఫ్యాక్టరీ కావడంతో భారీగా మంటలు చేలరేగాయి. మంటల కారణంగా ఆ పరిసరాలను భారీగా పొగ ఆవరించింది. సమీపంలోని భవనాలకు కూడా మంటలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు.