గత నెల దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఇప్పటికే పలు దేశాలకు ఈ వేరియంట్ వ్యాప్తి చెందింది. అయితే ఇటీవల భారత్‌లోకి కూడా ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించింది. భారత్‌లోని పలు రాష్ట్రాలకు వ్యాప్తి చెందిన ఒమిక్రాన్ వేరియంట్ దాని ప్రభావాన్ని చూపుతోంది. 20 రోజుల వ్యవధిలోనే దాదాపు 100కు పైగా ఒమిక్రాన్ కేసులు దేశ వ్యాప్తంగా నమోదయ్యాయి.…
ధాన్యం కొనుగోళ్లపై లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలంటూ తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రత్యకప్రసారం కోసం కింద ఉన్న లింక్ ను క్లిక్ చేయండి.
క్రైస్తవులకు పర్వదినమైన క్రిస్మస్‌ను పురస్కరించుకొని సీఎం కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో మంగళవారం విందును ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎల్బీ నగర్ వైపుకు వెళ్లే ట్రాఫిక్‌పై ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దీని ప్రకారం, బీజేఆర్ విగ్రహం వైపు ట్రాఫిక్ అనుమతించబడదని, నాంపల్లి, చాపెల్ రోడ్ వైపు మళ్లించబడుతుందని అధికారులు వెల్లడించారు. అదేవిధంగా, అబిడ్స్ రోడ్ నుండి ట్రాఫిక్‌ను బీజేఆర్ విగ్రహం వైపు అనుమతించరు. ఆ…
ఈక్విటీ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ సోమవారం ప్రారంభ ట్రేడ్‌లో 1,000 పాయింట్లకు పైగా క్షీణించింది. పెరుగుతున్న ఓమిక్రాన్ కేసులపై ఆందోళనలు పెట్టుబడిదారులను భయపెట్టడంతో గ్లోబల్ మార్కెట్లలో అమ్మకాల మధ్య అంతటా నష్టాలను చూసాయి. నిరంతర విదేశీ నిధుల ప్రవాహం కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది. ప్రారంభ ట్రేడింగ్‌లో 30 షేర్ల ఇండెక్స్ 1,028.61 పాయింట్లు (1.80 శాతం) క్షీణించి 55,983.13 వద్దకు చేరుకుంది. అలాగే నిఫ్టీ 307.50 పాయింట్లు (1.81 శాతం) తగ్గి 16,677.70 వద్దకు చేరుకుంది.…
కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా దేశంపై తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 6,563 కొత్త కరోనా కేసులు రాగా, 132 మంది మరణించారు. అయితే నిన్న ఒక్క రోజు 8,077 మంది కరోనా నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 82,267 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ ఇటీవల దేశంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయితే…
ఇటీవల ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను ఇంటర్ బోర్డ్ అధికారులు విడుదల చేశారు. అయితే ఈ ఫలితాలలో 51 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. టాప్ ర్యాంక్ విద్యార్థులు కూడా పాస్ కాకపోవడం గమనార్హం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికీ పలువురు విద్యార్థులు ఫెయిల్ అయ్యామనే మనస్థాపంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో విద్యార్థి సంఘాలు ఇంటర్ బోర్డు, విద్యాశాఖ తీరుపై నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే విద్యాశాఖ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై…
దేశంలో మాదకద్రవ్యాల సరఫరాపై కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. అనుమానం వచ్చిన ప్రతిచోట తనిఖీలు చేపట్టి మాదకద్రవ్యాల స్మగ్లర్లకు చెక్ పెడుతున్నారు. అయితే తాజాగా గుజురాత్ తీరంలో భారీగా హెరాయిన్ పట్టుబడటం కలకలం రేపుతోంది. భారత రక్షణ దళం, గుజరాత్ ఏటీఎస్ సంయుక్తంగా గుజరాత్ తీరంలో ఆపరేషన్ నిర్వహించాయి. దీంతో భారత జలాల్లో పాకిస్తాన్‌కు చెందిన ఫిషింగ్ బోట్‌ను అధికారులు సీజ్ చేశారు. బోట్‌లో రూ.400 కోట్లు విలువ చేసే 77…
తెలుగు రాష్ట్రాలపై చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. పలు జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతున్నాయి. దీంతో ఉదయం పూట పొంగమందు కురియడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు జనాల కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత 10 సంవత్సరాల్లో ఈ ఏడాది అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే తాజాగా తెలంగాణలోని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రికార్డ్ స్థాయికి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమురం భీం…
ప్రపంచ దేశాలు గత 2 సంవత్సరాలుగా కరోనా మహామ్మారితో పోరాడుతూనే ఉన్నాయి. కరోనా రక్కసి కొత్తకొత్త రూపాలు ఎత్తి ప్రజలపై విరుచుకుపడుతోంది. మొన్నటి వరకు అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు సైతం డెల్టా వేరియంట్‌ను తట్టుకోలేక విలవిలలాడిపోయాయి. అయితే ఇప్పుడు గత నెలలో దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందుతోంది. అంతేకాకండా ఆయా దేశాల ప్రజలపై దాని ప్రభావాన్ని చూపుడంతో భారీగా ఒమిక్రాన్ వేరియంట్…
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై ఇంకా స్పష్టత నెలకొనడం లేదు. దీంతో ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నేడు టీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టనున్నాయి. జిల్లాల్లో, నియోజకవర్గాల్లో, మండలాల్లో ఉన్న టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొనాలని కేసీఆర్ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టే నిరసనల్లో ఆయా ఎమ్మెల్యేలు పాల్గొనాలని కేసీఆర్ సూచించారు. ఈ నేపథ్యంలో ధాన్యం సేకరణలో కేంద్ర తీరుపై ఊరురా టీఆర్ఎస్…