వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలో నేటి నుంచి ఈ నెల 25వరకు సుపరిపాలన వారోత్సవాలు జరుగనున్నాయి. వారోత్సవాల్లో భాగంగా ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సుపరిపాలన వారోత్సవంపై కేంద్ర ప్రచారం ప్రారంభించనుంది.
ఏపీలో సినిమా టికెట్ల ధరలపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌లో అప్పీల్‌కు వెళ్లింది. ఈ నేపథ్యంలో టికెట్ల ధరలపై హైకోర్టులో విచారణ జరుగనుంది.
శీతాకాల పార్లమెంట్ సమావేశాలు గత నెలలో ప్రారంభమయ్యాయి. అయితే నేడు 17వ రోజు పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి. పార్లమెంట్ ముందుకు మహిళల కనీస వివాహ వయసు పెంపు బిల్లుపై చర్చ జరుగనుంది. పురుషులతో పాటు మహిళల వివాహ వయసు 18 నుంచి 21 ఏళ్లకు పెంచనున్నారు.
నేడు లోక్‌సభ ముందుకు ఎన్నికల చట్టాల బిల్లు 2021 రానుంది. ఓటరు జాబితాలో డూప్లికేషన్ నివారించే దిశగా కీలక నిర్ణయం తీసుకోకనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టనుంది.
నేడు తిరుపతిలో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. వరద బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరపున భువనేశ్వరి ఆర్థికసాయం అందజేయనున్నారు. మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పన ఆర్థికసాయం అందించనున్నారు.
బీజేపీ, కేంద్ర వైఖరిపై నేడు టీఆర్‌ఎస్ నిరసనలు చేపట్టనుంది. అన్ని జిల్లాల్లో, నియోజకవర్గాల్లో, మండలాల్లో టీఆర్‌ఎస్ నేతలు నిరసనలు చేపట్టనున్నారు. సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొనాలని టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నియోజకవర్గా కేంద్రాల్లో నిర్వహించే నిరసనలలో ఆయా ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.
ఫలితాల్లో తప్పిన విద్యార్థులను పాస్ చేయాలని డిమాండ్ చేస్తూ నేడు తెలంగాణలో ఇంటర్ కళాశాలల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలకు నిరసనగా విద్యార్థి సంఘాలు బంద్‌లు నిర్వహించనున్నాయి.