మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఒక్కసారి దేశవ్యాప్తంగా భారీగా పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో కరోనా కేసులు మరింత ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విశాఖలోని ఎలమంచిలి మండలం కొక్కిరాపల్లి గురకుల పాఠశాలలో కరోనా కలకలం రేపుతోంది.
గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ దంపతులకు కరోనా పాజిటివ్ రావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు.
అయితే గురుకుల పాఠశాలలో సుమారు 570 మంది విద్యార్థులు చదువుతున్నారు. రేపటి నుంచి సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో కొక్కిరాపల్లి గురుకుల పాఠశాలలో టెన్షన్ నెలకొంది. పాఠశాల ప్రిన్సిపల్ దంపతులకు కరోనా పాజిటివ్ రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.