కరోనా థర్డ్ వేవ్ కారణంగా ఎన్నో సినిమాల విడుదల వాయిదా పడింది. అయితే కరోనా విజృంభిస్తున్న కూడా.. సంక్రాంతి బరిలో అక్కినేని నాగార్జున, నాగచైతన్యలు నటించిన బంగార్రాజు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సంపాందించుకుని సంక్రాంతి విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరంలో బంగార్రాజు సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, సీఎం జగన్‌ల భేటీ గురించి మాట్లాడానని ఆయన వెల్లడించారు. సినీ పరిశ్రమపై సానుకూలంగా సీఎం జగన్ స్పందించారని చిరంజీవి తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్బంగా సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అంతేకాకుండా సినీ పరిశ్రమకు ఇక అన్నీ మంచిరోజులేనని నాగార్జున అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వేడుకలో నారాయణమూర్తి కూడా పాల్గొని మాట్లాడుతూ.. సినిమాను కాపాడాలని రాష్ట్రంలో సంక్రాంతికి కర్ఫ్యూ పెట్టలేదన్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ పెట్టకుండా అన్ని షోలకు అనుమతిచ్చారని, సీఎం జగన్‌కు హుదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.