కరోనా మహమ్మారి రోజురోజుకు మరింతగా విజృంభిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి వచ్చిన తరువాత మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు దేశవ్యాప్తంగా భారీగా నమోదవుతున్నాయి. అయితే కరోనా రక్కసి కొత్త కొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలపై విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా సోకి ఇంటివద్దనే ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నవారి కోసం విలువైన సమచారాన్ని సోషల్‌మీడియా వేదికగా వెల్లడించింది.
కోవిడ్ సోకినవారు తీసుకోవాల్సిన మందులపై అవగాహన కల్పిస్తూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. అయితే ఈ మందులు తీసుకునేవారు డాక్టర్ సలహాతో వాడవలసిందిగా సూచించారు. కోవిడ్ సోకినవారు ఏ మందులు ఎప్పుడెప్పుడు వేసుకోవాలో తెలియజేస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలకోసం క్రింద ఇచ్చిన లింక్‌ను చూడండి..
దయచేసి గమనించండి!
— Telangana Digital Media Wing (@DigitalMediaTS) January 18, 2022
ఇంటి వద్ద ఐసోలేశన్ లో ఉన్న కోవిడ్ వ్యాధిగ్రస్తులు డాక్టర్ సలహాతో వాడవలసిన మందులు ఇవి. ఎప్పటికప్పుడు కోవిడ్ చికిత్స మార్గదర్శకాలు అప్డేట్ అవుతుండటం వలన ఈ తాజా సమాచారం ఉపయోగించగలరు 🙏#COVID19 pic.twitter.com/ykt2r0aFzT