Pakistan: ప్రపంచం ఆశ్చర్యపోయేలా పాకిస్థాన్ భారీ ఎత్తున ఉగ్రవాద సంస్థను అబోటాబాద్‌లో నడుపుతోంది. ఈ విషయాన్ని భారత ఇంటెలిజెన్స్ టీమ్ పసిగట్టింది. ఈ ఉగ్ర క్యాంప్‌ను ఏకంగా సైన్యంలోని కీలక జనరల్ దీన్ని పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఓ జాతీయ ఆంగ్లపత్రిక కథనం ప్రచురించింది. నిషేధిత ఉగ్ర సంస్థలు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్లు కలిసి ఏకంగా పాక్ సైనిక స్థావరం పక్కనే ఓ మెగా టెర్రర్ క్యాంప్‌ను ఏర్పాటు చేశాయని తెలిపింది. ఇందులోకి అనుమతి లేకుండా బయటి వ్యక్తులు అడుగు పెట్టడం అంత ఈజీ కాదని చెప్పుకొచ్చింది.
Read Also: Union Bank Of India: భారీగా లోకల్ ఆఫీసర్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఇక, పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన ఓ గుర్తు తెలియని జనరల్ ఈ టెర్రర్ క్యాంప్ ను పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ యువకులు, యువతులకు ఆయుధ వినియోగంతో పాటు ఇతర ఉగ్ర కార్యకలాపాల్లోనూ ట్రైనింగ్ ఇస్తున్నారు. గతంలో అబోటాబాద్‌లోని ఓ సేఫ్ హౌస్‌లోనే అల్‌ఖైదా ఉగ్ర సంస్థ నాయకుడు బిన్ లాడెన్ దాక్కొన్నాడు. 2011 మే నెలలో అమెరికా కమాండోలు రహస్యంగా హెలికాప్టర్లలో ఇక్కడికి చెరుకుని లాడెన్‌ను చంపివేయడంతో ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఆ ఇంటిని పూర్తిగా కూల్చివేసింది. అయితే, ఇప్పుడు అదే స్థలంలో కొత్తగా ఉగ్రవాద శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం.
Read Also: Modi Laddu: ఈ దీపావళికి ‘మోడీ లడ్డూ’ స్పెషల్ ఏంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
కాగా, ఈ ప్రదేశంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది అని ఇండియన్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. టెర్రర్ చీఫ్‌లు హఫీజ్ సయీద్, మసూద్ అజర్, సయ్యద్ సలాహుద్దీన్‌లు ఈ క్యాంప్‌ను సందర్శించినట్లు పేర్కొనింది. ఇది పాకిస్థాన్‌లోనే అతి పెద్ద టెర్రర్ క్యాంప్‌గా గూఢచారి అధికారులు భావిస్తున్నాయి. లష్కరే, జైషే, హిజ్బుల్ సంస్థలు సంయుక్తంగా ఇక్కడే నియామకాలు చేపడుతున్నట్లు సమాచారం. కొన్నాళ్లుగా జమ్మూ కశ్మీర్‌లో టెర్రరిస్టుల దాడులు పెరిగిపోవడంతో అబోటాబాద్‌లో ఉగ్ర శిబిరం విషయం బయటకు రావడం గమనార్హం.