సిట్ తో పేదల బియ్యం మాఫియా ఆగడాల ఆటకట్టు అన్నారు ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్.. మీడియాతో మాట్లాడిన ఆయన.. కాకినాడ పోర్టులో కూలీలకు పని కల్పించడం అంటే అక్రమ అవినీతి బియ్యం వ్యాపారంతో కాదు.. సక్రమమైన ఎగుమతులు - దిగుమతుల వ్యాపారంతో అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవుచెప్పారు.. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం పేదలకు ఆకలి తీర్చాలని రెట్టింపు బియ్యం ఇస్తే, కాకినాడ పోర్టు నుండి రెట్టింపు బియ్యం…
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ 2047 అమల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ది పర్చాలనే లక్ష్యంతో రూపొందిస్తున్న స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాల సాధన దిశగా 20 సూత్రాల కార్యక్రమం అమలు చేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు ఛైర్మన్ లంకా దినకర్ తెలిపారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు.
Lanka Dinakar: ఏపీ పునర్విభజన చట్టాన్ని చెల్లని చెక్కులాగా కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తే ఆ తప్పును బీజేపీ సవరించి నిధులు ఇస్తుంది అని ఏపీ భారతీయ జనాతా పార్టీ ముఖ్య ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. తల్లి కాంగ్రెస్ చక్రవ్యూహ కబంధ హస్తాలలో రాష్ట్రం నలిగింది.. పిల్ల కాంగ్రెస్ చక్రబంధనంతో రాష్ట్రం రెక్కలు విరిగాయని ఆరోపించారు.
పవర్ ప్రాజెక్టుల ద్వారా అంతులేనంత పైసలు – భూములు దోపిడీ జరుగుతుందని ఏపీ బీజేపీ ముఖ్య అధికారప్రతినిధి లంకా దినకర్ అన్నారు. ఇవాళ ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో అపరిమిత “యాక్సిస్”, ఇండోసోల్ ఆయన “సోల్” అని ఆయన అన్నారు. యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 774.90 మెగావాట్ల పీపీఏ ప్రతిపాదనలను ఈఆర్సీ తిరస్కరించడాన్ని ఆహ్వానిస్తున్నామని, 774.90 మెగావాట్ల పీపీఏ రద్దు చేసినందున రాష్ట్రానికి 7300…
ఏపీలో సీఎం వైఎస్ జగన్ అస్మదీయుల విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపులలో రివర్స్ టెండ"రింగ్" జరిగింది.. జల, సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపు అక్రమాల పైన ప్రశ్నించి 7 నెలలు పైగా గడచినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏవిధమైన చలనం లేదన్నారు ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్.