మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఓ గ్రామంపై కొండచరిచయలు విరిగిపడటంతో 13 మంది మరణించారు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 100 మందికి పైగా చిక్కుకున్నారు. ఖలాపూర్ తహసీల్‌లోని ఇర్షాల్‌వాడి గ్రామంలోని ఇళ్లపై కొండ రాళ్లు, మట్టిపెళ్లలు పడటంతో అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ప్రమాదంలో మొత్తం 48 కుటుంబాలు చిక్కుకున్నాయి.
జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు ప్రధాన రహదారులను మూసివేశారు. భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రను వరుసగా రెండో రోజూ నిలిపివేశారు.
గత నెల నుంచి పాకిస్తాన్‌లో కురుస్తున్న రుతుపవనాల వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఎనిమిది మంది చిన్నారులతో సహా కనీసం 50 మంది మరణించారని అధికారులు శుక్రవారం తెలిపారు.
Brazil Floods: ఆకస్మిక వరదలు బ్రెజిల్‌లో బీభత్సం సృష్టిస్తున్నాయి.. ఇప్పటికే ఈ వరదల దాటికి 36మంది ప్రాణాలు కోల్పోయారు. సావో పౌలో రాష్ట్రంలో ఆకస్మిక వరదలు సంభవించాయి.
వెనెజులాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో నది పొంగిపొర్లడంతో 22 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 52 మంది గల్లంతయ్యారు.