Uttarakhand: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో పలు చోట్ల కొండచరియలు విరిగిపడిపోతున్నాయి. చమోలీ జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యాత్రికులు మరణించినట్లు అక్కడి పోలీసులు తెలిపారు.
China : చైనాలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో భారీ వర్షాల కారణంగా భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటి వరకు 47 మంది మరణించారు. మెయిజౌ నగరంలో మరో 38 మంది మరణించినట్లు ధృవీకరించినట్లు చైనా ప్రభుత్వ మీడియా శుక్రవారం మధ్యాహ్నం తెలిపింది.
సిక్కింలోని మంగన్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో.. భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురు గల్లంతయ్యారని అధికారులు గురువారం తెలిపారు. మరోవైపు.. కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు మూసుకుపోయాయి.. ఇళ్లు దెబ్బతిన్నాయి, విద్యుత్ స్తంభాల�
Heavy Rainfall:తమిళనాడు, కేరళలోని పలు జిల్లాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. ఈ వర్షాల కారణంగా తమిళనాడులోని పలు జిల్లాల్లో కూడా కొండచరియలు విరిగిపడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
కులులో కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు కూలిపోయాయి. దీంతో కూలిపోయిన భవనాలు, ఇళ్ల శిథిలాల మధ్య పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ కొండచరియల ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
అరుణాచల్ ప్రదేశ్‌లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో పలు జిల్లాల్లో రవాణా సౌకర్యం నిలిచిపోయింది. ఇదిలా ఉండగా శనివారం సిజి వద్ద అకాజన్-లికాబాలి-ఆలో రహదారిపై కొండచరియలు విరిగిపడినట్లు ఓ అధికారి తెలిపారు.
మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఓ గ్రామంపై కొండచరిచయలు విరిగిపడటంతో 13 మంది మరణించారు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 100 మందికి పైగా చిక్కుకున్నారు. ఖలాపూర్ తహసీల్‌లోని ఇర్షాల్‌వాడి గ్రామంలోని ఇళ్లపై కొండ రాళ్లు, మట్టిపెళ్లలు పడటంతో అనేక ఇళ్లు నేలమట్టమ�