HYDRA : హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల రక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా ప్రజావాణి కార్యక్రమానికి ఈ సోమవారం భారీ స్పందన వచ్చింది. చెరువులు, కుంటలు, నాళాలు, రహదారులు, ఇతర ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా ప్రత్యేకంగా పని చేస్తోంది. ప్రజల సమస్యలను స్వీకరించి పరిష్కారాన్ని అందించేందుకు ప్రతీ సోమవారం హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అధికారులకు వివరించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సోమవారం నిర్వహించిన హైడ్రా…
Waqf Amendment Bill : వక్ఫ్ సవరణ బిల్లుపై జెపిసి నివేదికను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. దేశవ్యాప్తంగా వివాదాస్పద వక్ఫ్ ఆస్తుల కేసుల గురించి కూడా లోక్‌సభ స్పీకర్‌కు సమర్పించిన జెపిసి నివేదిక వివరణాత్మక వివరాలను అందిస్తుంది.
కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. హైడ్రా ఏర్పాటుకు ముందు అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలను హైడ్రా కూల్చదని ప్రకటించారు. అనుమతి లేకుండా కట్టిన నివాస గృహాలు జూలై 2024కి సిద్ధమై, వాటిలో నివాసం ఉంటే వాటిని హైడ్రా కూల్చదన్నారు. అనుమతులు లేకుండా కట్టిన వాణిజ్య, వ్యాపార కట్టడాలను మాత్రం ఎప్పుడు కట్టినా ఎఫ్టీఎల్‌లో ఉంటే కూల్చడం జరుగుతుందన్నారు.
గిరిజన రైతుల గురించి చర్చించాలని చర్చకు పట్టుబడితే సభను వాయిదా వేయడాన్ని తప్పుబడుతున్నామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా వ్యాఖ్యానించారు. రైతులకు బేడీలు వేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. సభ జరిగినన్నీ రోజులు గిరిజన రైతుల పక్షాన పోరాడుతామన్నారు. శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యుల నిరసన నేపథ్యంలో శాసనమండలి బుధవారానికి వాయిదా పడింది.
రాష్ట్రంలో భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారానికై తగు మార్గ దర్శకాలను ప్రతిపాదించేందుకు గాను ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ధరణి పనితీరు, భూ సంబంధిత అంశాలపై సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు దామోదర రాజ నర్సింహా, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, తదితర ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు…
MLA Muthireddy: జనగామ బీఆర్ ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తాజాగా మరో వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి సొంత కూతురే.. పెద్ద చర్చనీయాంశంగా మారింది. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి భూమి తీసుకున్నారని కూతురు తుల్జా భవానీ రెడ్డి కూడా తన తండ్రి ముత్తిరెడ్డిపై ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
Srisailam Land Disputes: దేవాదాయ, ధర్మాదాయ శాఖ చరిత్రలో ఈ రోజు శుభదినంగా పేర్కొన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. శ్రీశైలం దేవస్థానం సరిహద్దు సమస్యకు పరిష్కారం దొరికింది.. రెండో ప్రధాన ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని తెలిపారు. అటవీశాఖతో చాలా కాలంగా భూవివాదం కొనసాగుతోంది.. అయితే, రెవెన్యూ, ఎండోమెంట్, ఫారెస్ట్ శాఖలతో సమీక్ష నిర్వహించాం.. మూడు శాఖలు సమన్వయంతో పనిచేసి సరిహద్దులు నిర్ణయం…
Land Disputes: నిజామాబాద్ జిల్లా మోపాల్‌లో దారుణం జరిగింది. కని పెంచిన తండ్రి, బాబాయిని పారతో అతి కిరాతకంగా కొట్టి చంపాడు కొడుకు. దీనికి గల కారణం భూ తగాదాలే అంటున్నారు స్థానికులు. కర్రోళ్ల అబ్బయ్య, అతని సోదరుడు సాయిలు, అబ్బయ్య కుమారుడు సతీష్ కు మధ్య కొద్ది రోజులుగా భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. భూమి తనకు కావాలని కొడుకు సతీస్ తండ్రిని, బాబాయ్ ని రోజు వచ్చి గొడవ పడేవాడని వారిద్దరు తీవ్ర మస్తాపం…
ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ నేతల ల్యాండ్ పంచాయితీలు శ్రుతి మించుతున్నాయి. గుడిహత్నూర్.. ఇచ్చోడ మధ్య ఉన్న భూమి విషయంలో కొన్నాళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఆ ల్యాండ్ పంచాయితీ బీజేపీ ఎంపీ సోయం బాపూరావ్ ఇంటికి చేరడంతో.. సమస్యపై మాట్లాడేందుకు కొందరు పార్టీ నేతలు కూడా అక్కడికి వెళ్లారు. ఒకానొక సమయంలో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరగడంతో సమస్య మరో మలుపు తీసుకుంది. జిల్లా అధికార ప్రతినిధి ప్రవీణ్‌రెడ్డి ఎంపీ ఇంట్లోకి దూసుకెళ్లారని ఎంపీ గన్‌మెన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం..…
ఇరు వర్గాల మధ్య భూమి విషయంలో జరిగిన గొడవ.. ముగ్గురు హత్యలకు దారి తీసింది.. తెలంగాణలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారంలో రెండు వర్గాల మధ్య పత్తి చేన్ల వద్ద వివాదం మొదలైంది.. మాటలు, వాగ్వాదం, తోపులాటతో.. చివరకు గొడ్డళ్లతో దాడి చేసేవరకు వెళ్లింది.. ఓ వర్గం గొడ్డళ్ల దాడిలో ఒకే కుటుంబానికి చెందిన తంద్రి, ఇద్దరు కుమారులు అక్కడికక్కడే మృతిచెందారు.. ముగ్గురుని హత్య…