ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. నిరసన తెలుపుతున్న రైతులపై వాహనం దూసుకుపోగా, నలుగురు రైతులు సహా ఎనిమిదిమంది మృత్యువాతపడడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.. అయితే, కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రానే వాహనంతో రైతులపైకి దూసుకెళ్లారనే ఆరోపణలు రావడం.. ఆ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సంచలన విషయాలు బయటపెట్టింది.. రైతులను చంపాలన్న పక్కా ప్రణాళికతోనే వాహనం నడిపారని సిట్ తన లేఖలో పేర్కొంది.. నిర్లక్ష్యం కారణంగా…
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ లఖింపూర్‌ఖేరిలో నిరసన తెలుపుతున్న రైతులను ఓ కారు ఢీ కొట్టింది. ఆ ఘటనలో కొంత మంది రైతులు మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన కారును నడిపింది హోం శాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కొడుకేనంటూ ఆరోపణలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆ ఘటనపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై సిట్ విచారణ జరిపి ఆ ఘటన కుట్రపూరితంగానే జరిగిందని వెల్లడించింది.…
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టు ఇవాళ మరోసారి విచారణ జరపనుంది. ఈ ఘటనపై దసరా పండగ ముందు విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ ధర్మాసనం.. యూపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దయచేసి విచారణకు హాజరుకండి అంటూ నిందితుడికి సీఆర్‌పీసీ-160 కింద పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని తప్పు పట్టింది. మిగతా కేసుల్లో నిందితుల విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తారా? అని నిలదీసింది. కాగా, లఖింపూర్ ఉద్రిక్తతల్లో నలుగురు రైతులు…
దేశవ్యాప్తంగా లఖింపూర్ ఖేరి ఘటన తీవ్ర కలకలం సృష్టించింది… కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా కాన్వాయ్‌తో రైతుల ర్యాలీపైకి దూసుకుపోవడంతో నలుగురు రైతులు మృతిచెందగా.. ఆ తర్వాత జరిగిన హింసలో మరో నలుగురు మృతిచెందడం సంచలనంగా మారింది… అయితే, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసేందుకు సిద్ధం అయ్యారు కాంగ్రెస్ నేతులు.. రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల ప్రతినిధి బృందం.. రేపు రాష్ట్రపతితో సమావేశం కానుంది.. ఈ సందర్భంగా లఖింపూర్ ఖేరి హింస ఘటనపై వాస్తవాలను…
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన.. లఖింపూర్ ఘటనలో కీలక నిందితుడిగా ఉన్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు… ఆశిష్ మిశ్రా ఆచూకీ ఇంకా తెలియలేదు. అతను ఎక్కడున్నాడనే దానిపై స్పష్టత కొరవడింది. క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి హాజరు కావాలంటూ జారీ చేసిన నోటీసులకూ ఆశిష్ స్పందించలేదు. ఇవాళ ఉదయం పదింటికి.. క్రైం బ్రాంచ్‌లో విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ.. అతను రాకపోవడంతో ఎక్కడున్నాడనే ఉత్కంఠ నెలకొంది. ఆశిష్ మిత్రా ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడనే విషయం.. ఎవరికీ తెలియడం లేదు. పోలీసులు…
లఖింపూర్ ఖేరి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది… ఈ వ్యహారంపై సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది… ఈ ఘటనకు సంబంధించి ఇప్పటిదాకా ఎంత మందిని అరెస్ట్ చేశారో చెప్పాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు సీజేఐ ఎన్వీ రమణ.. అయితే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నల నేపథ్యంలో యూపీ ప్రభుత్వంలో కదలిక మొదలైంది.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు పోలీసులు.. కాగా, గత సోమవారం ఆశిష్…