శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి ఆలయంలో పంపిణీ చేసే లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చిందంటూ ఆరోపణలు గుప్పుమన్నాయి.. అయితే, లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చిందన్న ఆరోపణల వెనుక కుట్రకోణం ఉందంటున్నారు ఆలయ ఈవో శ్రీనివాసరావు.. దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు తెలిపారు.. అంతేకాదు, శ్రీశైలం పోలీస్‌స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు.. దేవస్థానం సీసీ టీవీ ఫుటేజీ పరిశీలనతో ఆ కుట్రకోణం వెలుగులోకి వచ్చినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.. శ్రీశైలం దేవస్థానంపై దుష్ప్రచారం చేసేలా కుట్రకు పాల్పడ్డారని ప్రభుత్వానికి ఈవో నివేదిక ఇచ్చారు..
ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం సాయంత్రం శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా హాజరైన భక్తులు స్వామివారి కల్యాణోత్సవాన్ని తన్మయత్వంతో తిలకించారు. రాములవారి కల్యాణానికి సంబంధించి సీతమ్మవారి కోరికను శాస్త్రరీత్యా తెలిపే కాంతకోరిక కార్యక్రమాన్ని 6 గంటలకు వేదిక మీద అర్చకులు నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం ప్రారంభమైంది. ముందుగా భగవత్ విజ్ఞాపనం, సభ అనుజ్ఞ, లోకకల్యాణం కోసం…
Tirumala Laddu: లడ్డూ ప్రసాదం అంశంపై కోయంబత్తూర్‌కు చెందిన ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, అధినేత సద్గురు తన స్పందనను వ్యక్తం చేశారు. ఆలయ ప్రసాదంలో ఆవు కొవ్వును భక్తులు వినియోగించడం అత్యంత అసహ్యకరమని అన్నారు. అందుకే దేవాలయాలు ప్రభుత్వ పరిపాలన ద్వారా కాకుండా భక్తులచే నడపబడాలని సద్గురు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ప్రసాదంగా అందించే లడ్డూలలో నెయ్యి కల్తీ అని ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర…
తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో మూడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. శ్రీవారి సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ వెల్లడించింది. కంపార్టుమెంట్లలోని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నప్రసాదం, పాలు, తాగునీటి సరఫరా చేస్తున్నట్లు వివరించింది. శ్రీవారిని బుధవారం నాడు 66,745 మంది భక్తులు దర్శించుకున్నారని.. 30,780 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని వెల్లడించింది. హుండీ ద్వారా స్వామివారికి రూ.5.14 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ పేర్కొంది. మరోవైపు…