రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భద్రతా వలయం ఉంది. అలాంటి పుతిన్‌పై హత్యాయత్నం జరిగినట్టు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ చీఫ్ కిరిలో బుదనోవ్ ఉక్రెయిన్ మీడియాతో తెలిపారు. నల్ల సముద్రం, కాస్పియన్ సముద్రం మధ్య ఉన్న కాకసస్ ప్రాంతంలో పర్యటనకు వెళ్ళినప్పుడు.. అక్కడి ప్రతినిధులు పుతిన్‌పై దాడి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ దాడి నుంచి పుతిన్ తప్పించుకున్నారని అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలైన తొలినాళ్లలో ఈ దాడి జరిగినట్లు ఆయన…