మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో జూలై 21నుంచి ఓ చిరుత కనపడకుండా పోయింది. రేడియో కాలర్ పనిచేయడం మానేసినప్పటి నుంచి చిరుత జాడ తెలియలేదు. అయితే 22 రోజుల సెర్చ్ ఆపరేషన్ తర్వాత ఆదివారం పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ చీతాకు పెద్ద ఎదురుదెబ్బ తగులుతున్నది. ఇప్పటికే మూడు చీతాలు, ఓ చిరుత పిల్ల మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం మరో రెండు చిరుత పులి పిల్లలు మృతి చెందాయి.