ప్రధాని నరేంద్ర మోడీ ఒక రాజులా పాలిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ప్రభుత్వానికి సంబంధించిన జాతికి అంకితం అయినా ఎల్‌ఐసీ, విశాఖ స్టీల్, టెలికాంను ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు.
తమిళ్ సై తెలంగాణ వదిలి వెళ్లిపోవాలని, మోడీ తెలంగాణకు రావద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రధానికి తెలంగాణ పట్ల అనుకోని ప్రేమ వచ్చిందని ఎద్దేవ చేశారు.
మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కాకరేపుతోంది.. ఏ పార్టీ ఇస్తుంది.. ఏ పార్టీ పంచుతుంది అనే విషయం పక్కన పెడితే.. మద్యం ఏరులైపారుతోంది.. ఇక డబ్బులు వెదజల్లుతున్నాయి ఆయా పార్టీలు.. ఈ వ్యవహారంలో భారతీయ జనతా పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు… ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి కాకుండా కార్పొరేట్ శక్తులకు కాపలాదారుడు అయ్యాడని ఆరోపించిన ఆయన.. ఎక్కడైనా సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఉప ఎన్నికలు వస్తాయి..…