బండి సంజయ్ ఏం చదువుకున్నారో మాకు తెలియదు సెన్సేషన్ కోసమో, వార్తల కోసమో ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని, దానిని ఖండిస్తే మేం బీఆర్ఎస్ కు సపోర్ట్ అంటారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఒక రాజులా పాలిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ప్రభుత్వానికి సంబంధించిన జాతికి అంకితం అయినా ఎల్ఐసీ, విశాఖ స్టీల్, టెలికాంను ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు.