Kunamneni Sambasiva Rao: బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కలిస్తే స్వాగతిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని నిలువరించాలనేది మా ప్రధాన ఎజెండా అన్నారు. మంచైనా చెడైన కలిసే ఉండాలి అనేది మా ఉభయపార్టీల లక్ష్యమని తెలిపారు. మాకు గౌరవమున్న పార్టీలోనే కొనసాగుతామని స్పష్టం చేశామన్నారు. బీఆఎస్, కాంగ్రెస్ కలిస్తే స్వాగతిస్తామన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎన్ని పార్టీలు కలిసినా స్వాగతిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. సీపీఎం, సీపీఐ ఒకటే కత్తి… రెండు కత్తులు కావని అన్నారు. సీట్లు ముఖ్యం కాదు.. గౌరవం ముఖ్యమని తెలిపారు. అవసరమైతే పదవులు త్యాగం చేస్తామన్నారు. బీఆర్‌ఎస్ తో పొత్తు ఉన్నా కూడా పోరాడేది మేమే.. ఇంకెవరన్న ప్రజల పక్షాన పోరాడుతున్నారా? అని ప్రశ్నించారు. కందాల, రేగా కాంతారావు, ఎవరి ఓట్లతో గెలిచారు? అదీ వారి విజ్ఞత, వారి మేధాశక్తికి హ్యాట్సాఫ్ అన్నారు. మీరు పాఠాలు చెప్తారా? మీరు ఎక్కడ గెలిచారు? ఇపుడు ఎక్కడున్నారు? ఎవర్ని ప్రశ్నిస్తున్నారు?నటించడం మాకు రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీపీఎం, సీపీఐ ఎప్పటికి అన్నదమ్ములమే అన్నారు. అన్న ఒకరు తమ్ముడు ఒకరు కాదన్నారు. ఇద్దరం ఒక తల్లి బిడ్డలమేఅని పేర్కొ్న్నారు. 40, 50 స్థానాలు ప్రభావితం చేస్తామ్ అది గెలుపైనా ఓటమైనా అని స్పష్టం చేశారు. 100 ఏళ్ళు మా పార్టీ బ్రతికి ఉందంటేనే మాకు ఒక లక్ష్యం ఉందన్నట్టు అని తెలిపారు. ఎన్ని స్థానాలు ఏంటని ఇంకా డిసైడ్ అవ్వలేదని అన్నారు.
Read also: Panipuri : ఏంటో ఈ ఆడవాళ్లు.. పానీ పూరి తిననంటే కొట్టి చంపేస్తారా?
లక్షలాది మంది విద్యార్థులు, యువత భవిష్యత్ నాశనం చేసేందుకు కుట్ర పన్నిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై ఉప వంటి చట్టాలను పెట్టాలని కునమునేని సాంబశివ రావు డిమాండ్ చేశారు. ఈ లీకేజీ లో భాగస్వామ్యం వున్న అందరినీ అరెస్ట్ చేసి కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. పదవ తరగతి , గ్రూప్ పరీక్షల్లో ఇటీవల కాలంలో లో పరీక్ష పత్రలు లీక్ అయ్యాయి. ఇదీ విద్యార్థులకు తీవ్ర నష్టం అని అన్నారు. పదవ తరగతి పరీక్షల లీకేజీ వ్యవహారంలో.. బండి సంజయ్, పలువురికి జరిగిన చాట్ వ్యవహారంలో ఆధారాలు దొరికినట్లు గా వరంగల్ సి పి స్పష్టం చేశారన్నారు. బీజేపీ రాజకీయ ప్రయోజనం కోసం ఇలా లీక్ లు చేయడం దారుణమని అన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడ్డ బండి సంజయ్ పై మామూలు చట్టాలు పని చేయవని కఠినచర్యలు తీసుకోవాలని సాంబశివ రావు మండిపడ్డారు.
Bandi sanjay: ‘బండి’ అత్తగారింట్లో ‘బలగం’ సీన్ రిపీట్