ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిపోయింది. ఒకరిపై మరొకరు తీవ్రంగా దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా టీడీపీ నేత కూన రవికుమార్.. స్పీకర్ తమ్మినేని సీతారాంపై ధ్వజమెత్తారు. ఆయన పిచ్చోడైపోయాడని, నియోజకవర్గంలో ఒక్క పని కూడా చేయలేకపోయారని విమర్శించారు. స్పీకర్‌గా ఉంటూ, రాజకీయాల మీద బెట్టింగ్‌లు కడతానంటున్న ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని రవికుమార్ ప్రశ్నించారు. ఉద్యోగాలిస్తానని ప్రజల దగ్గర నుంచి డబ్బులు దండుకున్నారని, అందుకే మీకు ఓట్లు వేయాలా?…
టీడీపీ నేత కూన రవి కుమార్ కి శరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. రాష్ట్రాన్ని వదిలివెల్లోద్దని కూనరవికుమార్ కి ఆదేశం ఇచ్చింది. అయితే కూన రవి కుమార్ మాట్లాడుతూ… భావ ప్రకటనా స్వేచ్ఛకు ఆటంకం కల్పిస్తున్నారు. కనీసం నోటీసు ఇవ్వకుండా… ఇంటి వద్దకు వచ్చారు. నేను ఏటువంటి నిరసనకు పిలుపు ఇవ్వలేదు. నన్ను ఏందుకు అడ్డుకుంటున్నారో కనీసం చెప్పలేదు . ఇప్పటికి మూడు తప్పుడు కేసులు పెట్టారు. ఇప్పటికి పదిసార్లు పోలీసులు ఇష్టారాజ్యంగా ఇంట్లోకి…
దేశంలో రైతులను దొంగల్లా చూసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని టీడీపీ సీనియర్ నేత కూన రవి కుమార్ అన్నారు. రాష్ట్ర ఆర్దిక వ్యవస్ధకి రైతులే వెన్నెముక.. జగన్ ఆ వెన్నెముక లేకుండా చేస్తున్నారు. భూగర్జ జలాలు పెంపొందించి కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు నీరు చెట్టుకి శ్రీకారం చుట్టారు. జగన్ పాలనలో వ్యవసాయ రంగం సాధించిన ప్రగతి ఏంటంటే.. రైతు ఆత్మహత్యలో 3 వస్ధానం, కౌలు రైతు ఆత్మహత్యల్లో 2 వస్ధానం అని…
ఏపీ తాలిబన్ రాజ్యంగా మారింది. పోలీసుల గన్నులు పెట్టి జగన్ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు అని టీడీపీ నేత కూన రవికుమార్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడే మహిళలకు రక్షణ లేకుండా పోయింది.ప్రతిపక్ష పార్టీగా మాకు నిరసన చేసే హక్కులేదా… నిరసనలు ,పరామర్శలు చేస్తే అరెస్టులు చేసేస్తారా అని ప్రశ్నించారు. నారా లోకేష్, ఇతర టీడీపీ నేతలు చేసిన తప్పేంటి. అసలు రాష్ట్రంలో దిశ చట్టం ఉందా.. అమల్లోకి వచ్చిందా అని అడిగారు. ముఖ్యమంత్రికి పిచ్చిపట్టి ఏం మాట్లాడితే,…
రాజకీయాల్లో విమర్శలు కామన్. కొందరు శ్రుతిమించి మాటల తూటాలు పేలుస్తారు. ఇంకొందరు హద్దేలేదన్నట్టుగా వాగ్భాణాలు సంధిస్తారు. ఈ విషయంలో ఆ మామా అలుళ్లు ఆరితేరిన వారే. కాకపోతే అల్లుడు దూకుడుగా వెళ్తుంటే.. మామా స్పీడ్ తగ్గించారట. దాంతో మామకు ఏమైంది అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. వారెవరో ఈస్టోరీలో చూద్దాం. 2014 నుంచి ఇద్దరి మధ్యా తీవ్రస్థాయిలో మాటల యుద్ధం శ్రీకాకుళం జిల్లాలో ఫ్యామిలీ పాలిటిక్స్‌కు కేరాఫ్ అడ్రసైన ఆమదాలవలసలో.. మామా అల్లుళ్ల మాటల యుద్ధం పీక్స్‌కు చేరుకున్న…
తమ్మినేని పై మళ్లీ కౌంటర్ అటాక్ కు దిగారు కూనరవికుమార్. జగనన్న భూమ్, జామ్ మందులు తాగడం మానుకోవాలని… పిచ్చి మందు తాగి తమ్మినేని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పిచ్చి బ్రాండ్లు తాగడం తగ్గిస్తే మంచి మాటలొస్తాయని… మొక్కలు ఆక్సిజన్ పీల్చుకుంటాయనడం ఈ మందు ప్రభావమేనని తెలిపారు. ‘నన్ను పాతాళంలోకి తొక్కేయడం నీ అబ్బతరం కూడా కాదు…నా కాలు బొటనవేలు మీదున్న వెంట్రుక కూడా పీకలేవు ‘ అంటూ కూన రవి కూమార్ మండిపడ్డారు. read…
శ్రీకాకుళం : టీడీపీ నేత కూన రవికుమార్ కు మరో సారి స్పీకర్ తమ్మినేని కౌంటర్ ఇచ్చారు. ఎవరికి ఎక్కడ ఎలా చెక్ పెట్టాలో తనకు తెలుసని.. తాను కచ్చితంగా ఆ పంథాలో వెళతానని తెలిపారు. గట్టిగా నోరుపెడితే బెదిరిపోయేవాడిని కాదని.. వంద కాదు వెయ్యి అడుగులైనా ముందు కెళతానని స్పష్టం చేశారు. read also : ఏపీలో 1184 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ : ఏపీపీఎస్సీ వామనావతారుడి మాదిరి భూమిలోకి తొక్కేస్తానని… అందులో ఎలాంటి అనుమానం…
తమ్మినేని సీతారాం మనిషి రూపంలో ఉన్న ఒక మృగం. ఆయనకు అభివృద్ధి చేయడం చేతకాదు..రాదు అని అన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్. ప్రజలను రెచ్చగొట్టి … తన్నుకుంటే చూస్తూ ఉండటం ఆయనకు ఆనందం. వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోవడానికి తమ్మినేని సీతారాం , ఆయన కుమారుడే కారణం. తమ్మినేని ఉన్మాదిలా మాట్లాడుతూ.. కార్యకర్తలను ఉన్మాదుల్లామారుస్తున్నారు. జిల్లాలో విచ్ఛిన్న శక్తులు అరాచకం సృష్టిస్తున్నాయి. టీడీపీకి ఓటు వేస్తే మంచినీరు కూడా తాగనివ్వరా అని ప్రశ్నించారు. పోలీసులు బాధ్యతారాహిత్యం…
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన కుమారుడిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కూన రవికుమార్.. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం ఉప్పినవలస గ్రామంలో పర్యటించిన ఆయన.. నిన్న కత్తుల దాడిలో గాయపడిన కుటుంబాలను పరామర్శించారు. వైసీపీ వర్గీయులు దాడులు చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ.. ఎస్సైకి ఫోన్ చేసి వాగ్వాదానికి దిగారు. ఇక, ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు కూన రవికుమార్.. గడచిన ఐదేళ్లలో ఆముదాలవలస నియోజకవర్గంలోని…
శ్రీకాకుళం జిల్లాలోని కోవిడ్ కేర్ ఆసుపత్రిని పరిశీలించేందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పిలుపునిచ్చారు. దీంతో టీడిపీ కార్యకర్తలు పాత్రుని వలసలోని కోవిడ్ కేర్ ఆసుపత్రుకి చేరుకున్నారు. ప్రస్తుతం కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలులో ఉండటంతో పోలీసులు అనుమతించలేదు. పాత్రుని వలస వెళ్లకుండా టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. కూన రవికూమార్ బయటకు వెళ్లడానికి వీలులేదని, పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో కూన రవికుమర్ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.…