తమ్మినేని సీతారాం మనిషి రూపంలో ఉన్న ఒక మృగం. ఆయనకు అభివృద్ధి చేయడం చేతకాదు..రాదు అని అన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్. ప్రజలను రెచ్చగొట్టి … తన్నుకుంటే చూస్తూ ఉండటం ఆయనకు ఆనందం. వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోవడానికి తమ్మినేని సీతారాం , ఆయన కుమారుడే కారణం. తమ్మినేని ఉన్మాదిలా మాట్లాడుతూ.. కార్యకర్తలను ఉన్మాదుల్లామారుస్తున్నారు. జిల్లాలో విచ్ఛిన్న శక్తులు అరాచకం సృష్టిస్తున్నాయి. టీడీపీకి ఓటు వేస్తే మంచినీరు కూడా తాగనివ్వరా అని ప్రశ్నించారు. పోలీసులు బాధ్యతారాహిత్యం వల్లే ఉప్పినవలస ఘటన చోటుచేసుకుంది. నేనూ ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేశా. నా వల్ల ఆమదాలవలసలో ఏనాడైనా ఒక్క వైసీపీ కార్యకర్త అయినా ఇబ్బంది పడ్డారా. ఉప్పినవలస ఘటన పై ఎస్పీ ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం అని పేర్కొన్నారు.