ఎంతమంది పాలకులు మారినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఆదివాసీల తలరాతలు మాత్రం మారడం లేదు. రోడ్డు, రవాణా సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంతో పచ్చి బాలింత పది కిలో మీటర్లు పసిబిడ్డతో నడిచి ఇంటికి చేరుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కొమురం భీం జిల్లాలో మారుమూల గ్రామాలకు రోడ్ల కష్టాలు తీరడం లేదు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గోవెన నాయకపుగూడ గ్రామానికి సరిగ్గా రోడ్డు సౌకర్యం లేదు. దీంతో ఈ బాలింత ఇంటికి చేరాలంటే నడుచుకుంటూ…