దక్షిణ భారత కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతర వేళ తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్. రేవంత్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయాలతో గిరిజన గడ్డపై అడుగుపెట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వెలుపల, అది కూడా మేడారం వంటి పుణ్యక్షేత్రంలో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించి ముఖ్యమంత్రి సరికొత్త చరిత్రకు నాంది పలికారు. మేడారం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గిరిజన తల్లుల గొప్పతనాన్ని కొనియాడారు. “ధీరత్వమే దైవత్వంగా మారిన చారిత్రక సత్యం మేడారం మహోత్సవం. కాకతీయుల కత్తికి ఎదురు నిలిచిన…