KTR Comments: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్న సందర్భంగా.. ఆయనను అడ్డుకునేందుకు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు విశ్వ ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే కేటీఆర్ వ్యాఖ్యలకు వ్యతిరేకరంగా వారు నిరసన వ్యక్తం చేశారు. ఇకపోతే, రాష్ట్ర మహిళా కమిషన్ (బుద్ధ భవన్) ఆఫీసు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆయనకు ఉమెన్ కమిషన్…
KTR at Women's Commission: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను అడ్డుకునేందుకు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నం చేశారు.
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ (శనివారం) రాష్ట్ర మహిళా కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఉదయం 11 గంటలకు ఆయన మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లబోతున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర డీజీపీని కలిశారు. నిన్న తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో బాంబుల సంస్కృతి తిరిగి తీసుకువస్తున్నారన్న నాయకులు మండిపడ్డారు. పోలీసుల స్వయంగా ధర్నా శిబిరం పైన దాడి చేయడం టెంట్ పీకి వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చాక అరాచక పాలన…
రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరితా, విజయారెడ్డిపై సీఎం అనుచరులు దాడి చేయటాన్నిభారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్ట్ లపై దాడి చేయటం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఇందిరమ్మ పాలనగా ఫోజులు కొట్టే రేవంత్ రెడ్డి… మీ పాలనలో మహిళా జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ‘ఇద్దరు మహిళ జర్నలిస్ట్…
చేవెళ్ల రైతు నిరసన దీక్ష కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సచివాలయంలో లంకె బిందెలు ఉంటాయనుకున్నా కానీ అవి లేనే లేవు. ఎట్ల రుణమాఫీ చేయలే అన్నట్లుగా మాట మార్చాడన్నారు. కొత్తగా వచ్చాడు కదా ఆయనకు కొంత టైమ్ ఇద్దామని మేము కూడా ఎదురుచూశామని, ఇదే రేవంత్ రెడ్డి బ్యాంకర్లతో సమావేశం పెట్టాడు. 2 లక్షల రుణం మాఫీ కోసం రూ. 49 వేల కోట్లు కావాలని బ్యాంకర్లు…
BRS Dharna: రైతు రుణమాఫీ కోసం బీఆర్ఎస్ రణం షురూ చేసింది. సర్కార్ మెడలు వంచి ఎటువంటి ఆంక్షల్లేకుండా రైతులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలనే డిమాండ్‌తో బీఆర్ఎస్ పార్టీ గురువారం రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నా చేపట్టనున్నది.
ఇప్పటి సీఎం అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జన్వాడ ఫామ్ హౌస్ పోతే డ్రోన్లు ఎగురవేశారని కేసులు పెట్టారని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇప్పుడెందుకు కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. ఆయన మరి ఆ రోజే ఫామ్ హౌస్ నాది కాదని కేటీఆర్ చెబితే అయిపోవు కదా?.. కానీ ఇప్పుడు ఇతరుల పేరుపై మార్చి నాది కాదు అంటే ఎలా? అని ప్రశ్నించారు.
కేటీఆర్.. జన్వాడ ఫాం హౌస్ నాది కాదంటారు..? మిత్రున్ని కోర్టుకు పంపించారు.. అక్రమ నిర్మాణం కూల్చాలి అంటారు.. ఇంకో పక్క కోర్టులో స్టేకి వెళ్ళారని ఎంపీ చామల కిరణ్ అన్నారు. కేటీఆర్ పక్కన ఉండే చిల్లర మనుషులు మార్ఫింగ్ ఫోటోలతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని.. ఎఫ్టీఎల్ పరిధిలో ఎవరికి ఉన్నా.. హైడ్రా తన పని తాను చేస్తుందన్నారు.
సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ లలో ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఆరేడు వేల ఓట్లు మైనస్ అయ్యాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ చెబుతుంటే నవ్వొస్తోందన్నారు. కేటీఆర్ జన్వాడలో ఫామ్ హౌజ్ కట్టుకున్నారని.. నేను కేటీఆర్ ఫామ్ హౌజ్ చూసి వచ్చానన్నారు.