Bandi Sanjay: చనిపోయిన రైతులకు కూడా రుణమాఫీ చేయాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. కరీంనగర్ లో బండి సంజయ్ మాట్లాడుతూ.. రుణమాఫీ పూర్తిగా చేస్తారా చేయరా చెప్పండి అని ప్రశ్నించారు.
నేడు సీఎల్పీ సమావేశం.. రేపు అభిషేక్ సింఘ్వీ నామినేషన్.. నేడు కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. నానక్ రామ్గూడలోని హోటల్ షెరటన్లో రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. సీఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, ఎంపీలను ఆహ్వానించారు. ఈ భేటీలో రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీని పరిచయ కార్యక్రమంతోపాటు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. సీఎల్పీ సమావేశంలో తన…
రాజన్న సిరిసిల్ల పట్టణం శాంతి నగర్ బైపాస్ రోడ్డులో సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహనికి పూల మాల వేసి నివాళులు అర్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాజ్యాధికారం కొరకు పాటుపడిన మహానుభావుడు పాపన్న గౌడ్ అని ఆయన కొనియాడారు. భారత దేశానికి స్వాతంత్రం, తెలంగాణలో ఉన్న నిరంకుశ పాలనకు చరమగీతం పాడింది పాపన్ననే అని ఆయన వ్యాఖ్యానించారు. సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగించాలన్న సంకల్పంతో…
కామారెడ్డి క్లాసిక్ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ సన్మాన సభ. ఈ సభలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ పాల్గొన్నారు. ఎంపీగా మొదటిసారి కామారెడ్డికి వచ్చిన సురేష్ షెట్కార్ను షబ్బీర్ అలీ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ఆడవాళ్ళకు బ్రేక్ డాన్స్ చేయిస్తా అన్న వారికి బుద్ధి చెబుతామన్నారు. మా అక్క చెల్లెళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోమని ఆయన వ్యాఖ్యానించారు. 200 యూనిట్స్ కరెంటు కొన్ని…
KTR: తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ పేరుతో చేసిన మోసంపైన రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు.
సీఎం రేవంత్ రెడ్డి రూ. రెండు లక్షల రుణమాఫీ చేయగానే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇబ్బంది పడుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డిని శబాష్ అని మెచ్చుకోలేక టెన్షన్ లో వాళ్ళు ఉన్నారన్నారు.
సిద్దిపేట ప్లెక్సీ వార్ ఘటనలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులపై సిద్దిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఫ్లెక్సీ చింపివేశారని బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదుతో కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదైంది. సిద్దిపేట రూరల్, వన్ టౌన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు.. పోలీసులు. ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్ నుంచి సిద్దిపేటకి కాన్వాయ్ తో బయలుదేరారు.…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకున్న విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాలపై మంత్రి సీతక్క.. 'బస్సుల్లో మహిళలు అల్లం వెల్లుల్లి, కూతలు అల్లికాలు చేసుకుంటే తప్పేంటీ' అని ప్రశ్నించారు.
హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి హేయమైన చర్య అని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డ మండిపడ్డారు. ఇటువంటి చిల్లర వేషాలకు తాము భయపడమని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ పార్టీ అంతా రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తాం అని మాటిచ్చారని గుర్తు చేశారు.
తెలంగాణ భవన్ లో కేటీఆర్, హరీష్ రావుల ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన రుణమాఫీపై ప్రధానంగా చర్చించారు.