భద్రాచలం వెళ్తే సీఎం పదవి పోతుందని కేసీఆర్ వెళ్లడం లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ మూఢ విశ్వాసాలు ఈసారి ఎన్నికలు గట్టెక్కించలేవని తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీలను మంత్రి కేటీఆర్ మరోసారి టార్గెట్ చేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాలతో పోల్చాలని ప్రతిపక్ష పార్టీలకు కేటీఆర్ సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కెటి రామారావు 'డిగ్రీ సర్టిఫికేట్' అంశంపై ప్రధాని నరేంద్ర మోడీని ఎగతాళి చేస్తూ, తన సర్టిఫికేట్లను బహిరంగంగా పంచుకోవడానికి ఇబ్బంది లేదని అన్నారు.
Poster War In Telangana: తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాజకీయం వేడెక్కింది. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ల మధ్య పోస్టర్ వార్ ముదురుతోంది. నువ్వా నేనా అన్నరీతిలో పోస్టర్లు పెడుతూ ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. మూడు రోజుల క్రితం ఉప్పల్-నారపల్లి ఫ్లై ఓవర్ పనులపై ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నిస్తూ పోస్టర్ వెలిసింది.
వంద కోట్ల ఇస్తే.. కేటీఆర్ ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా ? అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. TSPSC పేపర్ లీకేజీ పై ఈడీ కి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర నేతలు పిర్యాదు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు 10 వేలు ఇస్తా అంటే రైతులకు ఎలా సరిపోతుంది? అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వడగళ్ల వాన తో రైతులు నష్టపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు 10 వేలు ఇస్తా అంటే ఎలా సరిపోతుందని ప్రశ్నించారు.
కేటీఆర్ పై కుట్రలు చేస్తున్నారు.. ప్రతిపక్షాల చర్యలు సరిగా లేవని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. నల్లగొండ జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో నియంత పాలన సాగుతుందని అన్నారు.
ఫెడ్ ఎక్స్ ఒక్క సంస్థ ఏడు వేల ఉద్యోగాలు సృష్టించిందని, గతేడాది లో లక్ష 50 వేల ఉద్యోగాలు సంవత్సరం వచ్చాయని, 2021 లైఫ్ సైన్సెస్ సిస్టం విలువ 50 బిలియన్ డాలర్లని తెలిపారు. 2030 వరకు 250బిలియన్ డాలర్లు అనుకుంటున్నామని, ఇది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందు ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు.
టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ వ్యవహారంపై మంత్రి లీగల్ నోటీసులు పంపడంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.