తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. లక్షల ఎకరాల్లో పంటలు నాశనమవుతున్నాయి. కందిపప్పులో నూర్చిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో నియోజకవర్గ స్థాయి ప్లీనరీకి బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రతినిధుల సభలు జరగనున్నాయి. ప్రతి సభలో మూడు వేల నుంచి 3,500 మంది కార్యకర్తలు, పార్టీ ప్రతినిధులు పాల్గొననున్నారు.
రాష్ట్రానికి మోడీ చేసిన మోసాలు, బీజేపీ చేసిన అన్యాయాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలని మంత్రి కేటీఆర్ నేతలకు సూచించారు. బీఅర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో కేటీఆర్ ఆదివారం టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ నెల 25న జరగబోయే ప్రతినిధుల సభలు.. వచ్చే ఎన్నికలకు బలమైన పునాదిరాళ్లు అంటూ నేతలకు సూచనలు చేశారు.
ఈ ఏడాది 9 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో మరో అడుగు పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతి ఇచ్చింది. దీంతో మరో వంద ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
సీఎం కేసీఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు ఇంటర్నేషనల్ స్కూల్లో 12వ తరగతి పూర్తి చేసి పట్టా తీసుకున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్ డే వేడుకకు హిమాన్షు తాత, నాయనమ్మలైన సీఎం కేసీఆర్, శోభ దంపతులు.. తల్లిదండ్రులు కేటీఆర్, శైలిమ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఐటీ శాఖామంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. వారు అడిగే ప్రశ్నలకు రీట్విట్ చేస్తూ సమాధానం ఇస్తుంటారు. ప్రతిపక్షాల విసుర్లకు కూడా ఆయన సరైన రీతిలో సమాధానం ఇస్తూ సెటెర్లు వేస్తుంటారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 11.00గంటలకు దుమాల గ్రామంలో యాదవుల మల్లన్న పట్నాలకు హాజరు కానున్నారు.
Perni Nani vs KTR: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం తాత్కాలికంగా వెనక్కి తగ్గింది.. అయితే, ఇది మా వళ్లే సాధ్యం అయ్యిందంటున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. విశాఖ ఉక్కుపై గట్టిగా మాట్లాడింది మన సీఎం కేసీఆరే నన్న ఆయన.. మేం తెగించి కొట్లాడాం.. కాబట్టే కేంద్రం ఇప్పుడు ఒక ప్రకటన చేసింది.. తాత్కాలికంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంపై వెనక్కి తగ్గిందని.. కేసీఆర్ దెబ్బ అంటే అట్లా ఉంటుంది మరి అని వ్యాఖ్యానించారు..…
తెలంగాణ ఎందులో ముందుందో అందరికీ తెలుసని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంత్రి కేటీఆర్ పై సెటైర్లు వేశారు. రోజ్ గార్ మేళాలో పాల్గొన్న ఆయన దేశ వ్యాప్తంగా 71 వేల మందికి ప్రధాని మోడీ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వనున్నారని తెలిపారు.
MLA Seethakka : గన్నేరువరం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమం, బహిరంగ సభకు ములుగు ఎమ్మెల్యే సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొననున్నారు.