Minister KTR: ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించనున్నారు. ఎస్‌ఆర్‌డిపి కింద నగరంలో నిర్మించిన 20వ ఫ్లైఓవర్ ఇది. దీనికి తెలంగాణ తొలి హోంమంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టారు. ఈ ఫ్లై ఓవర్ ద్వారా విద్యానగర్, ఉప్పల్, నల్లకుంట వెళ్లే ప్రజల ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. ఈ స్టీల్ బ్రిడ్జ్ ఇవాళ ఉదయం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ బ్రిడ్జి ఇదేనని ప్రభుత్వం చెబుతోంది. ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ వరకు మొత్తం 2.62 కిలోమీటర్ల మేర నిర్మించారు. ఇది మొత్తం 81 స్తంభాలతో నిర్మించబడింది. రూ. 450 కోట్లతో నిర్మాణానికి వెచ్చించారు.
Read also: WHO Chief: ఆయుష్మాన్ భారత్ అద్భుత పథకం.. వైద్య రంగంలో డిజిటల్ సేవలు విప్లవాత్మకం
ఈనేపథ్యంలో.. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్టు సిటీ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. లాయల్ ట్యాంక్‌బండ్‌లోని కట్ట మైసమ్మ దేవాలయం, ఆర్టీసీ క్రాస్ రోడ్ల మధ్య ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమలులో ఉంటాయి. ఈ మేరకు హైదరాబాద్ నగర అదనపు ట్రాఫిక్ కమిషనర్ సుధీర్ బాబు ఓ ప్రకటన విడుదల చేశారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి ఇందిరాపార్క్ వరకు ఎక్స్ రోడ్ వైపు ట్రాఫిక్ అనుమతించబడదు. వాహనదారులు లోయర్ ట్యాంక్‌బండ్, ఎమ్మార్వో కార్యాలయం, స్విమ్మింగ్ పూల్ మరియు కట్టమైసమ్మ దేవాలయం వద్ద ఇందిరా పార్క్ ఎక్స్ రోడ్ వైపు వెళ్లాలి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కట్ట మైసమ్మ దేవాలయం వైపు వచ్చే ట్రాఫిక్‌కు ప్రవేశం లేదు. ఇంటిపార్క్ ఎక్స్ రోడ్డు వద్ద బండ మైసమ్మ, స్విమ్మింగ్ పూల్, తహసీల్దార్ కార్యాలయం, లోయర్ ట్యాంక్‌బండ్ వైపు వాహనాలను మళ్లిస్తారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాలని పోలీసులు సూచించారు.
Ladies Special Bus: కోఠి- కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్.. ఈ నెల 21 నుంచి 127K నెంబర్..