Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. అయితే, నేడు నామినేషన్ పత్రాల దాఖలుకు గడువు ముగిసిపోతుంది. ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు బీఫాంలు సమర్పిస్తేనే ఆయా పార్టీల అభ్యర్థులుగా గుర్తిస్తామని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. బీ- ఫాంలు సమర్పించకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా గుర్తిస్తామని చెప్పుకొచ్చింది. ఇక, ఈనెల 13వ తేదీన నామినేషన్ల పరిశీలన చేయడంతో పాటు ఉపసంహరణకు ఈనెల 15వ తేదీ వరకు ఛాన్స్ ఉంది. ఇక, 30వ తేదీన పొలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగనుంది. నిన్న (గురువారం) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ సహా వివిధ పార్టీలకు చెందిన క్యాండిడేట్స్ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్ పత్రాలు సమర్పించారు.
చివరి రోజు కావడంతో ఈరోజు కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేడు కామారెడ్డి నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు స్థానిక రైల్వేస్టేషన్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు బైక్ ర్యాలీగా వెళ్లి అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేస్తారు. ఈసారి రేవంత్ రెడ్డి కొడంగల్‌తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు. నామినేషన్ అనంతరం కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రేవంత్ రెడ్డి ఈ నెల 6న కొడంగల్ లో నామినేషన్ దాఖలు చేశారు. నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15 వరకు గడువు ఇచ్చారు. నవంబర్ 30వ తేదీన తెలంగాణలోని 119 స్థానాలకు ఒకేరోజు పోలింగ్ జరగనుంది.
తెలంగాణలో ముగిసిన నామినేషన్ల పర్వం. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన, 15లోగా విత్‌డ్రాకు అవకాశం. ఈ నెల 30న పోలింగ్ డిసెంబర్ 3న కౌంటింగ్. మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిన నామినేషన్ల గడువు. ఇవాళ చివరి రోజు భారీగా నామినేషన్లు. ఆర్వో ఆఫీసుల్లో మధ్యాహ్నం 3 గంటల లోపు ఉన్నవారందరికీ నామినేషన్‌కు అవకాశం. నిన్నటి వరకు 2028 నామినేషన్లు.
కామారెడ్డిలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నామినేషన్ వేశారు. ఈకార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, బోస్ రాజ్, ఠాక్రే, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి జిల్లా ఆలేరులో మాజీ ఎమ్మెల్యే, ఆలేరు జడ్పిటిసి, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ కుడుదుల నగేష్ నామినేషన్ దాఖలు చేసారు. తనకు ఆలేరు టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి నగేష్ దరఖాస్తు చేసుకున్నారు. టికెట్ దక్కకపోవడంతో రెబల్ గా బరిలోకి దిగేందుకు నామినేషన్ దాఖలు.
వేములవాడ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డా. వికాస్ రావు నామినేషన్ దాఖలు చేశారు. బీఫామ్ పార్టీ తరుపున బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అందజేశారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మందుల సామెల్ నామినేషన్ దాఖలు చేశారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల బిజేపి అభ్యర్థిగా ఎంపీ ధర్మపురి అరవింద్ నామినేషన్ దాఖలు చేశారు. భార్యతో కలిసి నామినేషన్ దాఖలు చేసిన అరవింద్.
వికారాబాద్ జిల్లా తాండూర్ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసులో మూడవ సెట్టు నామినేషన్ పత్రాలు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రోహిత్ రెడ్డి దాఖలు చేశారు.
భువనగిరి నియోజక వర్గానికి బిజెపి అభ్యర్థి గూడూరు నారాయణ్ రెడ్డి నామినేషన్ సమర్పించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర యువజన క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ విచ్చేశారు. సాయిబాబా గుడి లో పూజల అనంతరం ర్యాలీగా బిజెపి అభ్యర్థి, కేంద్ర మంత్రి బయలుదేరారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు , కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.
భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా బిఅర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాత మధు, కోనేరు చిన్ని పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా అర్బన్ నియోజక వర్గం నుంచి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండవ సెట్ నామినేషన్ వేసిన గణేష్ గుప్తా. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితతో కలిసి మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు.
సూర్యాపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు నామినేషన్ వేశారు.
నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా దినేష్ కులాచారి నామినేషన్ వేశారు. నామినేషన్ లో ఈటల రాజేందర్ పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లాలో బీఆఎస్ అభ్యర్ధిగా మంత్రి అజయ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ బీజేపీ జనసేన అభ్యర్థి ముయ్యబోయిన ఉమాదేవి నామినేషన్ దాఖలు చేశారు. ఆంధ్ర నుండి భారీగా వచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం RDO కార్యాలయంలో జలగం వెంకట్రావు నామినేషన్ దాఖలు చేశారు. కొత్తగూడెం నియోజకవర్గం స్వాతంత్ర అభ్యర్థి జలగం వెంకట్రావు నామినేషన్ కు భారీ గా చేరుకున్న జలగం వెంకట్రావు అభిమానులు నాయకులు కార్యకర్తలు.
కొమురం భీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గానికి బీఎస్పీ అభ్యర్థిగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నామినేషన్ వేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ అసెంబ్లీ నియోజక వర్గానికి బీజేపీ పార్టీ తరుపున తన నామినేషన్ వేసిన తుల ఉమ. టికెట్ ఆశించి భంగపడ్డ డా. వికాస్ రావు తరుపున నామినేషన్ దాఖలు చేసిన అయన వర్గీయులు. ఉత్కంట భరితంగా సాగుతున్న బీజేపీ టికెట్ ఫైట్..
జనసేన మద్దతుతో మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజవర్గానికి బిజెపి అభ్యర్థి రామచందర్రావు నామినేషన్ దాఖలు చేశారు. బిజెపి నుండి ఆలస్యంగా దిగిన బలంగా దిగుతానని ధైర్యంగా దిగుతానని ఆత్మవిశ్వాసంతో దిగుతున్నానని మల్కాజిగిరిలో తప్పకుండా బిజెపి గెలుస్తుందని అన్నారు. మల్కాజ్గిరి ప్రజల కోరికపై కార్యకర్తల కోరికపై బిజెపి నుండి బరిలో దిగానని అన్నారు. మల్కాజ్గిరి నియోజవర్గంలో శాంతి అభివృద్ధి కరువైందని శాంతి కోసం అభివృద్ధి కోసం పోరాడుతానని బిజెపి అభ్యర్థి రామచందర్రావు అన్నారు.
మైలార్ దేవ్ పల్లి నుండి భారీ ర్యాలీతో రిటర్నింగ్ కార్యాలయంకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నామినేషన్ దాఖలు చేయడానికి బయలుదేరారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 12 వేల మంది కార్యకర్తలతో కలిసి పాద యాత్రగా ఉప్పర్ పల్లి బయలుదేరారు. దారి పొడవునా దర్శనమిచ్చిన గులాబీ జెండాలు. ప్రత్యేక ఆకర్షణగా కళాకారుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు. చివరి రోజు నామినేషన్ కు గడువు కావడంతో రిటర్నింగ్ కార్యాలయంకు చేరుకుంటున్న ఎమ్మెల్యే అభ్యర్ధులు.
ఇవాళ మధ్నాహ్నం 1.30 గంటలకు కామారెడ్డిలో రేవంత్ నామినేషన్ వేయనున్నారు. మూడు సెట్లతో రేవంత్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. రేవంత్ నామినేషన్ కి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హాజరుకానున్నారు.
కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. గాజులరామారం బీజేపీ కార్యాలయానికి పెద్ద ఎత్తున బీజేపీ, జనసేన శ్రేణులు, ప్రజలు చేరుకుంటున్నారు. మరికాసేపట్లో చిత్తారమ్మ ఆలయంలో కూన శ్రీశైలం గౌడ్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం భారీ ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళనున్న శ్రీశైలం గౌడ్.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏనుగు రవీందర్ రెడ్డి మరో సెట్ తో నామినేషన్ దాఖలు చేశారు. ఆర్వో కార్యాలయం వద్ద పోలీసులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అభ్యర్థిని ఆర్వో కార్యాలయం వెళ్లకుండా అడ్డుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు. అభ్యర్థి ముహూర్త సమయం అయిపోతుందని లోపటికి పంపించాలని పోలీసులతో వాగ్వాదం దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పాడి కౌశిక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
నిజామాబాద్ నియోజకవర్గంలో రూరల్ బీజేపీ అభ్యర్థిగా దినేష్ కులాచారి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట వచ్చిన ఈటెల రాజేందర్ కూడా వున్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్వో కార్యాలయంలో బీజేపీ అభ్యర్థి బొమ్మ శ్రీరామ్ నామినేషన్ దాఖలు చేశారు.
మల్కాజ్గిరి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా రామచంద్రరావు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు.
మహేశ్వరం నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి ఈరోజు తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. కర్మన్ఘాట్ హనుమాన్ టెంపుల్ లో ప్రత్యేక పూజల అనంతరం భారీ ర్యాలీతో మహేశ్వరం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు.
రాజేంద్రనగర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కస్తూరి నరేందర్ ఆద్వర్యంలో లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇంట్లో కుటుంబ సభ్యుల తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ ర్యాలీతో నామినేషన్ వేయడానికి నరేందర్ బయలుదేరారు. బండ్లగూడ ఆరే మైసమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయం నుండి నేరుగా ఉప్పర్ పల్లి లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంకు 10 వేల మంది కార్యకర్తలు బయలుదేరారు. పుప్పాల్ గూడ నుండి రాజేంద్రనగర్ వైపు వెళ్లే దారి కోలాహలంగా మారింది.
ఇవాళ కామారెడ్డి లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
నామినేషన్ అనంతరం కామారెడ్డిలో టీపీసీసీ ఆధ్వర్యంలో బీసీ డిక్లరేషన్ సభ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బీసీ డిక్లరేషన్ సభలో ప్రసంగించనున్నారు.
ముఖ్య అతిథిగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య హాజరుకానున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేడు కొత్తగూడెం బిఆర్ఎస్ అభ్యర్థిగా వనమా వెంకటేశ్వరరావు నామినేషన్ వేయనున్నారు.
జగిత్యాల జిల్లా కోరుట్లకు ఈటెల రాజేందర్ రానున్నారు. నేడు బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ నామినేషన్ వేయనున్నారు. కోరుట్ల బస్టాండ్ వద్ద రోడ్ షో ఇద్దరు నేతలు పాల్గొననున్నారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో ఈరోజు బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి బొడిగె శోభ నామినేషన్ వేయనున్నారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీజేపి అభ్యర్థి అమురాజుల శ్రీదేవికి షాక్. ఆమెను మార్చి హేమాజి కి టికెట్ ప్రకటించిన బీజేపీ అధిష్టానం. మహిళ అభ్యర్థి టికెట్ మార్పు రావడంతో శ్రీదేవి ఆవేదనకు గురయ్యారు. నిన్ననే నామినేషన్ దాఖలు చేసిన బెల్లంపల్లి బిజేపీ అభ్యర్థి శ్రీదేవి. ఇవ్వాళ వేరే వారికి టికెట్ ప్రకటించిన బీజేపీ అధిష్టానం.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు లో భాజపా నుంచి నామినేషన్ వేసిన నందీశ్వర్ గౌడ్ బుల్ రోజర్లతో ర్యాలీ గా తీసిన నందీశ్వర్ గౌడ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కేద్రమంత్రి రావుసాహెబ్ దాన్వే
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రామగుండం రిటర్నింగ్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కోరుకంటి చందర్.పాల్గొన్న ఎమ్మెల్సీ బాను ప్రసాద రావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొలెటి దామోదర్.
తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురారంలోని కట్టమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎన్నికల ఇంచార్జ్,ఎంఎల్ సి శంభీపూర్ రాజు పాల్గొన్నారు..ప్రత్యేకపూజల అనంతరం వేలాదిమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి సురారంలోని కట్టమైసమ్మ ఆలయం నుండి జిహెచ్ఎంసి వరకు ప్రతి కార్యకర్త చేతిలో గులాబీ జెండా, మెడలో గులాబీ కండువతో పండుగ వాతవరణంలో భారీ ర్యాలీని నిర్వహించి మరో సెట్ నామినేషన్ ను వేశారు ఎమ్మెల్యే అభ్యర్థి వివేకానంద. ర్యాలీలో భాగంగా ఓ బిఆర్ఎస్ వీరాభిమైని భారీ క్రైన్ తో 2 పూలదండలతో ఎంఎల్ఎ అభ్యర్థి వివేకానంద,ఎంఎల్ సి శంభీపూర్ రాజు మెడలో వేసి తన అభిమానాన్ని చాటుకున్నారు.
సంగారెడ్డిలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. సంగారెడ్డిలోని ఆర్డీఓ కార్యాలయంలో జగ్గారెడ్డి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. నిర్మల్ ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ దాఖలు కంటే ముందు మంత్రి తన నివాసంలో ప్రత్యేక పూజలు చేశారు. నిర్మల్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల నుంచి పెద్దఎత్తున బీఆర్‌ఎస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. నిర్మల్ పట్టణం ఎటు చూసినా గులాబీమయంగా మారింది.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు గజ్వేల్‌లో నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసిన సీఎం.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కామారెడ్డికి చేరుకున్నారు. అనంతరం పలువురు బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేశారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గం బీఎస్పి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ట్రాన్స్ జెండర్ పుష్పతలయ నామినేషన్ దాఖలు చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలోకి ట్రాన్స్ జెండర్ పుష్పతలయ తన నామినేషన్ పత్రాలను అందజేశారు.
రాజన్న సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేకే మహేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ పాలనలో సిరిసిల్ల ప్రజలు విసిగి వేసారి ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒకటి కూడా నిలబెట్టుకోలేదన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న కాలేశ్వరం ప్రాజెక్టు నాలుగు సంవత్సరాలు కాకముందుకే వాళ్ళ అవినీతికి నిదర్శనంగా కుప్పకూలిపోతుందన్నారు.
ముషీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ముఠాగోపాల్ భారీ ర్యాలీ నిర్వహించి అట్ట హాసంగా నామినేషన్ దాఖలు చేశారు... నామినేషన్ ప్రారంభానికి ముందు ముషీరాబాద్ చౌరస్తాలోని మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.... అనంతరం ముషీరాబాద్ లోని మహంకాళి దేవాలయంలో పూజలు నిర్వహించి భారీ ర్యాలీగా ఆయన బయలుదేరారు... ముషీరాబాద్ రిటర్నింగ్ కార్యాలయంలో నియోజకవర్గ ఎన్నికల అధికారి వి.లక్ష్మిణా రయణకు నామినేషన్ పత్రాలను అందజేశారు.
వికారాబాద్ జిల్లా తాండూర్ ఆర్డీవో కార్యాలయంలో ఎంపీ రంజిత్ రెడ్డి తో కలిసి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసారు.
కాచిగూడలోని లింగంపల్లి రాఘవేంద్ర స్వామి ఆలయంలో పూజ నిర్వహించిన అనంతరం కార్యకర్తలు నాయకులతో భారీ ర్యాలీగా వచ్చి అంబర్పేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కాలేర్ వెంకటేష్ నామినేషన్ దాఖలు చేశారు. సంప్రదాయ డప్పు వాయిద్యాలు, బోనాలు, కేరళ సింగారి మేలమ్ వాయిద్యాల మధ్య భారీ ర్యాలీగా బయలుదేరిన కాలేరు వెంకటేష్ కు కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలి రావడంతో రోడ్లన్నీ గులాబీమయం అయ్యాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చల్మెడ లక్ష్మీనరసింహారావు నామినేషన్ వేశారు. నామినేషన్ సందర్భంగా పట్టణంలో 20 వేల మందితో బిఆర్ఎస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్ నుండి ర్యాలీ ప్రారంభమై మున్సిపల్ ఆఫీస్ మీదుగా ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీ కొనసాగింది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో వేములవాడ పట్టణం జన సంద్రమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ హాజరయ్యారు.
నిజామాబాద్ జిల్లా అర్బన్ కాంగ్రెస్ అభ్యర్థిగా 2వ సెట్ నామినేషన్ ను మాజీ మంత్రి షబ్బీర్ అలీ దాఖలు చేసారు. నిజమాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయాలని చెప్పిన హై కమాండ్ కి ధన్యవాధాలు తెలిపారు. బీజేపీ ఓట్లు అడిగే ముందు బీడీ కార్మికుల సమస్య పరిష్కరించాలని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని తెలిపారు.
అసెంబ్లీలో ప్రభుత్వ విప్, బీఆర్‌ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ మంచిర్యాల జిల్లా చెన్నూరులో నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ కార్యక్తలు, నాయకులతో కలిసి చెన్నూరు పట్టణంలోని ఆర్వో కార్యాలయానికి వెళ్లిన సుమన్.. నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు పట్టణంలోని శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంత్రి హరీష్ రావుతో కలిసి నామినేషన్ వేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి. దుబ్బాకలో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో వచ్చిన ప్రభాకర్ రెడ్డి వీల్ ఛైర్ పై వెళ్లి నామినేషన్ వేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో తహశీల్దార్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు నామినేషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్ జిల్లా అంబర్పేట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కాలేరు వెంకటేష్ నామినేషన్ దాఖలు చేశారు. భారీగా పార్టీ కార్యకర్తలతో మహిళలతో కలసి నామినేషన్ దాఖలు చేసినా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్.