Jana Reddy: రాహుల్ గాంధీ పై కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డి కౌంటర్ ఇచ్చారు. జానారెడ్డితో.. జగదీశ్వర్ రావు, జూపల్లి భేటీ అయ్యారు. అనంతరం జానారెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్ కి సంస్కారం లేదన్నారు. రాహుల్ గాంధీపై సంస్కారం లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. సంస్కారం లేని వాల్ల గురించి మాట్లాడనన్నారు. నువ్వు చేస్తానన్నవి అమలు చేశావా ? అని ప్రశ్నించారు. మూడెకరాల ఇచ్చావా దళితులకు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లోకి జగదీశ్వర్ రావు తిరిగి చేరడం శుభసూచకమన్నారు. పార్టీ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇంకా జాబితా కొలిక్కి రాలేదన్నారు. క్లారిటీ వచ్చాకా అన్ని విషయాలపై మాట్లాడతా అన్నారు. కొంత మందితో మాట్లాడుతున్నాం .. అన్ని అయ్యాకా మాట్లాడతామని తెలిపారు. Upa దిగిపోయే నాటికి కరెంట్ ఇచ్చింది ఎవరు? 60 ఏండ్లు ఏ పదవి లేకుండా స్వాతంత్య్రం కోసం కొట్లాడింది కాంగ్రెస్ కదా? విశాల దృక్పధం తో పని చేసింది కాంగ్రెస్ కదా? సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వలేదా..? ఇప్పటి వరకు సాధించిన ప్రగతి ఎవరు సాధించారు మీరా ? ఉపాధి హామీ ఇచ్చింది..ఆహార భద్రత ..అటవీ హక్కులు ఇచ్చింది కాంగ్రెస్ కాదా..? అటవీ హక్కులు ఇవ్వకపోతే పోడు భూములు వచ్చేవా..? 2004 లోనే ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ అన్నారు.
పెడింగ్ బిల్లులు రద్దు చేసింది మేమే అన్నారు. ఇప్పుడు కొనసాగుతుంది.. మేము ఇచ్చిన కరెంట్ నే కదా..? అప్పట్లో డబ్బు పెట్టి కొనడానికి కూడా లేని పరిస్థితి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము ఇచ్చిన 7,8 గంటలే కదా.. మీరు ఇస్తున్నారు అన్నారు. కరెంట్ ఉత్పత్తికి కృషి చేసింది మేము.. వాటిని కొనసాగిస్తుంది మీరన్నారు. మేడిగడ్డ పై పూర్తిగా అధ్యయనం చేస్తామన్నారు. బీఆర్ఎస్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందన్నారు. బీఆర్ఎస్ ని సహించే పరిస్థితిలో జనం లేరన్నారు. కాంగ్రెస్ ని నిలబెట్టడానికి ప్రజలు సిద్ధమయ్యారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో తలసరి ఆదాయం పెరిగింది అంటున్నారని తెలిపారు. 2004 నుండి 14 వరకు 6.5 శాతం పెరిగిందన్నారు. బీఆర్ఎస్ 9 ఏండ్ల తలసరి ఆదాయం కంటే మేము చేసింది ఎక్కువ అన్నారు. మోడీ అప్పులు చేశారు అని విమర్శ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు అన్నారు. 5 లక్షల 50 వేళా కోట్ల అప్పు చేశారు మీరు అంటూ మండిపడ్డారు.
India-Canada: ట్రూడోని చూసి ఇండియాలో నవ్వుకుంటున్నారు.. కెనడా ప్రతిపక్ష నేత విమర్శలు..