జల వివాదంపై క్లారిటీ ఇచ్చారు సంయుక్త కార్యదర్శి, కేంద్ర జలశక్తి శాఖ సంజయ్ అవస్తీ. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాలను వివరించిన ఆయన… విభజన చట్టం ప్రకారమే తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటా పంపిణీ జరిగిందన్నారు. విభజన చట్టంలో సెక్షన్ 84 నుంచి 91 వరకు రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకం గురించి ఉందని…సెక్షన్ 84 ప్రకారం రెండు నదుల యాజమాన్య బోర్డులు ఏర్పాటు చేసి, పరిధి నోటిఫై చేయాల్సి…
కృష్ణా జలాల వివాదంపై టీఆర్ఎస్ ప్రభుత్వ తీరు చూస్తుంటే రాజకీయ కోణంలో అనుమానించాల్సిన వస్తోందని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు కొట్టుకునే దిశగా ఇరు రాష్ట్రాల మంత్రుల తీరు ఉందన్నారు. ఈ విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు మాటలు చూస్తుంటే రాజకీయ రగడ పుట్టేటట్లు ఉన్నాయన్నారు. ఇద్దరు సీఎంలు కలిసి భోజనాలు చేసే పరిస్థితి దాటి.. తిట్టుకునే పరిస్థితి చూస్తుంటే కొత్త రాజకీయ డ్రామాకు తెరలేపినట్లు కనిపిస్తోందని జగ్గారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.…
తెలంగాణ కాంగ్రెస్ కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టాక మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. అధికార పార్టీనే లక్ష్యంగా విమర్శల పదును పెంచారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం లేని నీళ్ల వివాదాన్ని మరోసారి సృష్టించి.. రెండు ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచి లబ్ది పొందాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ నీళ్ల నుండి నిప్పులు రాజేసి రావణ కాష్టంగా మార్చి కాచుకొగలడు. నీళ్లతో ఓట్లు కొల్లగొట్టడం కేసీఆర్ కి అలవాటు అని రేవంత్ రెడ్డి ఎద్దేవా…
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జాల వివాదం ముదురుతున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో కృష్ణా నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులను కలిపినా తమ రాష్ట్రానికి కేవలం ఒక టీఎంసీ నీటిని మాత్రమే వాడుకోగలమని.. కానీ, రోజుకు 11 టీఎంసీల నీటిని తరలించేలా జగన్ ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. కృష్ణా జలాల దోపిడీలో వైయస్ రాజశేఖరరెడ్డి పాత్ర లేదని.. కానీ, ఇప్పుడు జగన్ హస్తం ఉందని వ్యాఖ్యానించారు. రాయలసీమ…
కృష్ణానదీ జలాల వినియోగంపై క్రమక్రమంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వివాదం పెరుగుతున్నది. పోతిరెడ్డిపాడు దగ్గర రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌పేరిట రిజర్వాయరు సామర్థ్యం పెంచడం వల్ల శ్రీశైలం నీటిని తరలించుకుపోతారని తెలంగాణ ఆరోపణ. రాజోలిబండ డైవర్షన్ దగ్గర పనులకూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది.అయితే ఈ క్రమంలో తెలంగాణ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని దొంగ అని జగన్ గజదొంగ అని వ్యాఖ్యానించడం. తర్వాత ఏకంగా రాక్షసుడని తిట్టిపోయడం వేడిపెంచింది. ఇలా మాట్లాడటం సమంజసం…