Global Telugu Teacher: తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన కృష్ణప్రసాద్ గవర్నమెంట్ టీచర్. హెడ్‌మాస్టర్ కూడా. తెలుగు పైన ఆయనకు మమకారం ఎక్కువ. విద్యార్థుల్లో ఈ భాష మీద ఆసక్తి పెంచేందుకు కృష్ణప్రసాద్ చేస్తున్న ప్రయత్నాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు. చదువంటే ఇంగ్లిష్ పాఠాలే అన్నట్లుగా మారిన ఈ రోజుల్లో పిల్లల్లోని, తల్లిదండ్రుల్లోని ఈ అభిప్రాయాన్ని మార్చేందుకు ఆయన కృషి చేస్తున్నారు. పాఠాలను అందరికీ అర్థమయ్యేలా చెప్పేందుకు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు.